Moviesస్పైడర్ 200 కోట్ల బిజినెస్.. ఇక మిగతా రికార్డులు చెరిగిపోవాల్సిందే..!

స్పైడర్ 200 కోట్ల బిజినెస్.. ఇక మిగతా రికార్డులు చెరిగిపోవాల్సిందే..!

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా స్పైడర్. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా టీజర్ తో అంచనాలను పెంచేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సంచలనాలు సృష్టిస్తుండటం విశేషం.

ఇప్పటికే తమిళ రైట్స్ లైకా ప్రొడక్షన్స్ 23కోట్లకు కొనేశారని టాక్ రాగా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా 90 కోట్ల దాక బిజినెస్ జరిగిందని అంటున్నారు. అంతేకాదు తెలుగు తమిళ హింది భాషల్లో శాటిలైట్ రైట్స్ కూడా 25 కోట్ల దాకా అమ్ముడయ్యాయని తెలుస్తుంది. ఇక మలయాళ, హింది డబ్బింగ్ రైట్స్ కూడా మరో పాతిక కోట్లకు కొన్నారని అంటున్నారు.

మొత్తంగా స్పైడర్ 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో సంచలనం సృష్టించింది. నాన్ బాహుబలి రికార్డులు ఏ ఒక్కటి వదలకుండా రికార్డులను చెరిపేస్తున్న మహేష్ సినిమా రిలీజ్ తర్వాత కూడా అదే రేంజ్ కలక్షన్స్ తో అదరగొట్టాలని చూస్తున్నాడు. మహేష్ స్పై ఏజెంట్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news