Moviesఅతను మహేష్ ఒక్కడికే విలన్..!

అతను మహేష్ ఒక్కడికే విలన్..!

మురుగదాస్ డైరక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సినిమా స్పైడర్. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా దర్శకుడు ఎస్.జె.సూర్య నటిస్తుండగా మరో విలన్ గా హీరో భరత్ నటిస్తున్నాడు. మురుగదాస్ డైరక్షన్ తో పాటుగా మహేష్ హీరో అనే కారణం చేతనే తాను ఈ సినిమాలో విలన్ పాత్రకి ఒప్పుకున్నా అంటున్నాడు భరత్. తెలుగులో ప్రేమిస్తే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న భరత్ ఆ తర్వాత ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోలేకపోయాడు.

భరత్ ఇప్పటిదాకా తెలుగులో డైరెక్ట్ సినిమా చేయలేదు. మొదటిసారి మహేష్ సినిమాతోనే అది జరుగుతుంది. సినిమాలో మహేష్ తో పనిచేసిన అనుభవం గురించి చెప్పిన భరత్ మహేష్ చాలా ఓపికస్తుడని బైలింగ్వల్ మూవీ కాబట్టి ప్రతి సీన్ రెండు సార్లు చేస్తున్నా సరే ఏమాత్రం విసుగు చెందట్లేదని అంటున్నాడు.

హీరోగా అవకాశాలు రాక విలన్ గా మారలేదని.. మహేష్ సినిమా కాబట్టి విలన్ గా చేశానని అన్నారు భరత్. మురుగదాస్ డైరక్షన్ లో ఏ సీన్ అయినా ఆడియెన్స్ కు నచ్చేయొచ్చు భరత్ విలన్ గా ప్రేక్షకులు నచ్చేస్తే తాను కాదు కూడదు అన్నా సరే హీరోగా ఇచ్చే రెమ్యునరేషన్ ఇచ్చి మరి పర్మినెంట్ విలన్ చేసేస్తారు. సినిమాపై భరత్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు మరి అవి నెరవేరుతాయో లేదో తెలుసుకోవాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news