Gossipsఅక్కడ మహేష్ దమ్ము చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

అక్కడ మహేష్ దమ్ము చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా 130 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా హిందిలో కూడా భారీ మొత్తంగానే అమ్ముడయ్యింది. ఏ.ఏ ఫిలిమ్స్ పాతిక కోట్లకు పైగా స్పైడర్ హింది రైట్స్ కొనేశారు.

ఇప్పుడు అదే రేంజ్ లో మహేష్ నటిస్తున్న భరత్ అను నేను కూడా హింది రైట్స్ భారీ మొత్తానికి కొనేశారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం శ్రీమంతుడు కాంబోలో వస్తున్న భరత్ అను నేను మూవీ హింది రైట్స్ ఏకంగా 16 కోట్లకు అమ్ముడయ్యాయట. ఈ లెక్కన చూస్తే హిందిలో మహేష్ దమ్ము చూపించే టైం వచ్చేసిందని అంటున్నారు.

కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న భరత్ అను నేను సినిమాలో మహేష్ సిఎంగా కనిపించనున్నాడు. బాలీవుడ్ హాట్ బ్యూటీ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news