Gossipsరామ్ చరణ్ ‘ధృవ’ సినిమాపై మహేష్‌బాబు కామెంట్స్

రామ్ చరణ్ ‘ధృవ’ సినిమాపై మహేష్‌బాబు కామెంట్స్

According to the latest industry news, Prince Mahesh Babu watched Ram Charan’s latest sensation Dhruva and made some interesting comments. Read below article what he said.

ఒక హీరో చిత్రంపై మరొక కథానాయకుడు కామెంట్స్ చేయడం టాలీవుడ్‌లో చాలా అరుదు. ముఖ్యంగా.. స్టార్ హీరోలు ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ తమ సినిమాలపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయరు. హిట్ టాక్ వచ్చినా, ఫ్లాప్ అయినా.. అంటీముట్టనట్టుగా ఉంటారు. అలాంటిది.. ఎవరైనా ఒకరు స్పందిస్తే మాత్రం అది ఖచ్చితంగా హాట్ టాపిక్ అవుతుంది. అలాంటి న్యూసే ఇప్పుడొకటి ఫిలింనగర్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ‘ధృవ’ సినిమా మీద ప్రిన్స్ మహేష్‌బాబు ప్రశంసలు కురిపించాడన్నదే ఆ వార్త సారాంశం.

ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ధృవ’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తని ఒరువన్’కి రీమేక్ అయిన ఈ మూవీ ఒరిజినాలిటీకి ధీటుగా ఉందని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. దర్శకధీరుడు రాజమౌళి కూడా రైటర్ నుంచి డైరెక్టర్ వరకు ప్రతిఒక్కరిపై పొగడ్తల వర్షం కురిపించాడు. ఇంకా ఎందరో సెలబ్రిటీలు కూడా ఈ మూవీపై పాజిటివ్‌గానే స్పందించారు. తాజాగా ప్రిన్స్ మహేష్‌బాబు కూడా ఈ సినిమా మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడని, రామ్ చరణ్ పనితనాన్ని మెచ్చుకున్నాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మహేష్‌బాబు రీసెంట్‌గా ‘ధృవ’ మూవీని చూసి, దానిపై ప్రశంసలు కురిపించాడట. తమిళ్ వెర్షన్ ‘తని ఒరువన్’ కంటే తెలుగులో ఈ చిత్రం చాలా బాగుందని, రామ్ చరణ్ ఈ చిత్రం మొత్తంలో అద్భుతమైన నటన కనబరిచాడని పొగిడాడట. దర్శకుడు సురేందర్ రెడ్డి మంచి పనితనం చూపించాడని కొనియాడాడట. ఈ విషయం తెలుసుకున్న మెగాఫ్యాన్స్.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధృవ యూనిట్ కూడా మహేష్ వ్యాఖ్యలతో హ్యాపీగా ఉందని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news