Moviesమహేష్ మూవీ సీక్వల్ ప్లాన్ లో తేజ..!

మహేష్ మూవీ సీక్వల్ ప్లాన్ లో తేజ..!

తేజ డైరక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ నటించిన సినిమా తేజ. అప్పట్లో మంచి ఫాంలో ఉన్న తేజ మహేష్ లాంటి హీరో దొరికితే ఏ కమర్షియల్ సినిమానే తీయకుండా నిజం అంటూ వచ్చి నిరుత్సాహపరచాడు. ఈ సినిమా పర్సనల్ గా అటు తేజకు, ఇటు మహేష్ కు అవార్డులు రివార్డులు వచ్చేలా చేసినా కమర్షియల్ సక్సెస్ మాత్రం అందుకోలేదు.

అయితే ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చినా సినిమా మాత్రం సిని ప్రియుల మనసు గెలుచుకుంది. ప్రస్తుతం తేజ డైరక్షన్ లో రానా హీరోగా వచ్చిన నేనే రాజు నేనే మంత్రి ప్రమోషన్స్ లో తేజ నిజం సీక్వల్ గా ఓ కథ సిద్ధంగా ఉందని అన్నారు. ఆ సినిమాకు ఇది నిజం కాదు అని టైటిల్ పెట్టబోతున్నారట. సినిమా నిజం సీక్వల్ లానే ఉంటుందని కాకపోతే కథ మాత్రం కొత్తదే అంటున్నాడు తేజ.

మరి ఈసారి కూడా స్టార్ తో ఈ సినిమా తీస్తాడో లేక కొత్త వారికి అవకాశం ఇస్తాడో కాని నిజం పేరుతో మహేష్ సినిమా సీక్వల్ చెప్పి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు తేజ. మరి ఆ సినిమా కథ కమీషు ఏంటో మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news