Gossipsఆ సినిమాపై మ‌హేష్ కామెంట్ విన్నారా...

ఆ సినిమాపై మ‌హేష్ కామెంట్ విన్నారా…

ఇంతకాలం ప్లాప్ సినిమాలతో నెట్టుకొస్తూ  కెరియర్ ముగిసిపోయిందనుకుంటున్న సమయంలో ఎడారిలో భారీ వర్షం పడినట్లు హీరో రాజశేఖర్ కి చాన్నాళ్ల తరువాత ఓ హిట్ దక్కింది. హిట్ దక్కడమే కాదు టాలీవుడ్ అగ్ర హీరోలంతా ఈ సినిమా చూసి రాజశేఖర్ ని అభినందిస్తుండడంతో రాజశేఖర్ ఆనందానికి అవధులే లేకుండా పోయింది.

యాంగ్రీ యంగ్‌మేన్ డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన గరుడ వేగ‌ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు  తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లోనూ వసూళ్లలో అదరగొడుతోంది. ఇండస్ట్రీ ప్రముఖులు ‘గరుడ వేగ’పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా ‘గరుడ వేగ’ బాగా నచ్చేసింది. దీంతో సినిమాపై ప్రశంసలు గుప్పించాడు ప్రిన్స్.

“గొప్ప స్క్రిప్ట్, అద్భుతమైన పెర్ఫామెన్సులు, ఓవరాల్ గా ‘గరుడ వేగ’ స్టన్నింగ్. టీమ్ సభ్యుల కృషి అద్భుతం.. రాజశేఖర్ గారికి, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుకు శుభాకాంక్షలు”, అంటూ ట్వీట్ చేశాడు మహేష్. మహేష్ ట్వీట్’కు రాజశేఖర్ స్పందించారు. “థాంక్యూ సో మచ్ డియర్ మహేష్. మా కృషిని అభినందించడానికి కొంచెం సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు” అంటూ ఆనందంతో  రిప్లై ఇచ్చాడు రాజశేఖర్. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అను నేను” సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news