Moviesమహేష్ తో బోయపాటి.. ఆ సినిమా రికార్డులకు ఆకాశమే హద్దు..!

మహేష్ తో బోయపాటి.. ఆ సినిమా రికార్డులకు ఆకాశమే హద్దు..!

బోయపాటి సినిమా అంటే ఆడియెన్స్ లో ఓ ఉత్సాహం కనిపిస్తుంది. ఎంతమంది కమర్షియల్ అండ్ మాస్ డైరక్టర్స్ వచ్చినా బోయపాటి మార్క్ సినిమా చేయడం అనేది జరుగదు. అందుకే బోయపాటి తన సినిమాలకు తన మార్క్ వేసుకుంటాడు. లాస్ట్ ఇయర్ సరైనోడుతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను ఈసారి బెల్లంకొండ బాబుతో కూడా సత్తా చాటేశాడు.

రీసెంట్ గా రిలీజ్ అయిన జయ జానకి నాయకా సినిమా బోయపాటి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి, బాలయ్య, మహేష్ లతో సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు బోయపాటి. మహేష్ తో సినిమా గురించి కొన్ని ప్రత్యేకమైన ఆలోచనల్లో ఉన్నట్టు తెలుస్తుంది. తన పరంగా మహేష్ అంటే ఆల్ రౌండర్ అన్న ఫీలింగ్ లో ఉన్న బోయపాటి మహేష్ తో తీసే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు.

మహేష్ తో బోయపాటి మార్క్ సినిమా అంటే కచ్చితంగా ఆ సినిమా రికాడులకు ఆకాశమే హద్దని చెప్పొచ్చు. మహేష్ క్లాస్ స్టామినా బోయపాటి ఊరా మాస్ సత్తా కలిసి ఎలాంటి సినిమా వస్తుందో కాని ఆ కాంబోపై ఫ్యాన్స్ మాత్రం భారీ అంచనాలే పెట్టుకున్నారు. మరి ఆ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news