Gossipsవీరి కలయిక వెనుక ఆ దర్శకుడి హస్తం..

వీరి కలయిక వెనుక ఆ దర్శకుడి హస్తం..

మల్టీస్టారర్ మూవీలు ఈ మధ్యకాలంలో ఎక్కువయిపోయాయి. ఎప్పుడూ ఒకటే ట్రెండా .. ట్రెండ్ మారిస్తే బెటర్ అనే ఆలోచనకి మన టాలీవుడ్ హీరోలు వచ్చేశారు. అందుకే ఒక సినిమా వెనుక మరొకటి మల్టీస్టార్ మూవీస్ వస్తున్నాయి. అంతేకాదు .. ఇప్పటికే వచ్చిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర కాసుల రూపంలో భీపత్సం సృష్టించాయి.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల-గోపాల చిత్రాలు ముందు వరుసలో చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు కూడా మల్టీ స్టారర్ చిత్రాలకి ఒకే చెప్పేస్తూ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. మరో అగ్ర శ్రేణి హీరోలు మల్టీస్టార్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ఇండ్రస్ట్రీలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. ఈ చిత్రంలో స్టార్ హీరోలు బాల‌కృష్ణ‌, మ‌హేష్ బాబు న‌టించే ఛాన్స్ ఉంద‌ని సమాచారం.

బాలయ్య బాబుతో ఇప్ప‌టికే రెండు హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన బోయ‌పాటి ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశముంద‌ని తెలుస్తోంది. బాల‌య్య‌, మ‌హేష్‌తో హిట్ చిత్రాల‌ను నిర్మించిన 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్నినిర్మించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ కృష్ణ‌తో క‌లిసి బాల‌య్య ‘సుల్తాన్‌’ సినిమా చేశారు. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు మ‌హేష్‌తో సినిమా అంటే.. అది వార్త‌ల్లో విష‌య‌మే. ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news