Gossipsమహేష్ - వినాయక్ సినిమా... ఎంతవరకు నిజం ?

మహేష్ – వినాయక్ సినిమా… ఎంతవరకు నిజం ?

సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడు సినిమాల జోరు పెంచాడు. కొన్నాళ్లుగా ఇయర్ కు రెండు సినిమాలను రిలీజ్ చేద్దామన్నా కుదరకపోవడంతో ఈసారి ఏమాత్రం ఛాన్స్ లేకుండా ఇయర్ కు రెండు రిలీజ్ లు ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివతో భరత్ అను నేను సినిమా చేస్తున్న మహేష్ ఆ సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో సినిమాకు సిద్ధమయ్యాడు.

ఇక ఇవే కాకుండా త్రివిక్రం మైత్రి మూవీస్ కాంబినేషన్ లో సినిమాను లైన్ లో పెట్టాడట. ఇవన్ని ఉండగానే వినాయక్ తో కూడా మహేష్ సినిమా చేయబోతున్నాడని లేటెస్ట్ టాక్. ఖైది నంబర్ 150 సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తో సినిమా చేస్తున్న వినాయక్ ఆ తర్వాత మహేష్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడట.

త్వరలోనే ఈ కాంబినేషన్ కు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు. మరి మహేష్ తో వినాయక్ సినిమా అంటే ఇక ఆ సినిమా రికార్డులు గ్యారెంటీ అని చెప్పొచ్చు. సినిమా కాంబినేషనే అంచనాలను పెంచేస్తుంటే ఈ సినిమా తెరకెక్కితే ఇక ఎలా ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news