Moviesనానితో మతిమరుపు.. శర్వానంద్ తో అతి శుభ్రత.. మారుతి మహానుభావుడు టీజర్..!

నానితో మతిమరుపు.. శర్వానంద్ తో అతి శుభ్రత.. మారుతి మహానుభావుడు టీజర్..!

శర్వానంద్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా మహానుభావుడు. సినిమాలో విపరీతమైన నీట్ నెస్ చూపించే కుర్రాడుగా శర్వానంద్ కనిపిస్తున్నాడు. తనకున్న ఆ ఓ.సి.డి అదో రోగం అని చూపించాడు. శర్వా క్యారక్టర్ ను పరిచయం చేస్తూనే మహానుభావుడు టీజర్ ఇంప్రెస్ చేసింది.

థమన్ మ్యూజిక్ కొత్తగా అనిపించగా మెహెరిన్ కౌర్ హీరోయిన్ గా మెరిసింది. ఇక వంశీ ప్రమోద్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే వర్క్ అవుట్ అయినట్టు ఉన్నాయి. సింపుల్ గా వచ్చిన ఈ మహానుభావుడు మంచి ఫీల్ గుడ్ మూవీ అవుతాడనిపిస్తున్నాడు. సినిమాలను ఎప్పుడు సేఫ్ జోన్ లో తీసే మారుతి పక్కా హిట్ ఫార్ములాతో మహానుభావుడు సినిమాతో వస్తున్నాడని చెప్పొచ్చు.

ఎంటర్టైన్ సినిమాలకు మారుతి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారాడు. ఇక వరుస సక్సెస్ లో ఉన్న శర్వానంద్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. దసరా బరిలో పెద్ద సినిమాల నడుమ వస్తున్న ఈ మహానుభావుడు ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news