Movies" మహానటి " ప్రీ - రివ్యూ

” మహానటి ” ప్రీ – రివ్యూ

ఎవడే సుబ్రమణ్యం సినిమా తర్వాత డైరక్టర్ నాగ్ అశ్విన్ సావిత్రి జీవిత కథతో సినిమా చేయాలని భావించారు. ఆలోచన రావడమే ఆలస్యం ఆమె జీవిత గాథను తెలుసుకున్నారు. ఆమెతో సినిమాలు చేసిన వారి దగ్గర నుండి కొంత సమాచారం తెలుసుకున్నారు. ఫైనల్ గా మహానటిగా సావిత్రి బయోపిక్ తెరరూపం దాల్చింది.

మహానటి టైటిల్ రోల్ పోశించింది మలయాళ భామ కీర్తి సురేష్. సినిమా కోసం ఆమె ఎంత కష్టపడ్డది సినిమా టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. నటిగా అభినయ తారగా సావిత్రి పేరు మారుమోగుతుంది. నేటితరం తారామణులకు ఆమె ఆరాధ్య దైవం. సాధ్యమైంతవరకు ఆమె జీవితంలో జరిగిన మంచి చెడుల గురించి ఈ సినిమా ప్రస్థావించడం జరిగిందట.

ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు, క్రిష్, సమంత, షాలిని పాడే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ఇలా అందరు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. నిజ జీవిత పాత్రలని నటించే అదృష్టం కొందరికే వస్తుంది. అలా ఆనాటి పాత్రలన్నిటిని అద్భుత దృశ్య కావ్యంగా తీర్చిదిద్దారు దర్శకుడు నాగ్ అశ్విన్.

స్వప్నా సినిమాస్ బ్యానర్ లో స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంగీత పరంగా కూడా ప్రాముఖ్యత తెచ్చుకుంది. టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచగా కచ్చితంగా సినిమా మంచి ఫలితాన్నే తెచ్చుకుంటుందని ఆశిస్తున్నారు. సావిత్రి బాల్యం, ఆమె నటిగా మారిన పరిస్థితులు, ఆమె హీరోయిన్ గా మహానటిగా కిరీటం అందుకున్న రోజులనే కాకుండా చివరి దశలో ఆమె పొందిన దీన అవస్థను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. మరి సినిమా మనసులను కదిలించే కథ అయినా ఏమేరకు ప్రేక్షకులకు మెప్పిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news