Movies" మహానటి " Exclusive : ఏప్రిల్...

” మహానటి ” Exclusive : ఏప్రిల్ 14 (వెయిటింగ్ )

ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ బాగా నడుస్తుంది . ఆ మధ్య బాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ కి కూడా పాకిందనే చెప్పాలి . ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి బయోపిక్ ని అయితే ఏకంగ ఇద్దరు తీస్తున్న విషయం తెలిసిందే . అలనాటి అందాల నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ‘మహానటి’ చిత్రం తెరకెక్కుతోంది. సమంత, విజయ్ దేవరకొండ లాంటి నటుల ఫస్ట్ లుక్స్ ఇప్పటికే విడుదల చేశారు. ఇప్పుడు అసలైన క్యారెక్టర్ కీర్తిసురేష్ ను సావిత్రిలా ప్రజెంట్ చేయబోతున్నారు.

మహానటిలో కీర్తిసురేష్ ఎలా ఉండబోతోందనే విషయంపై ఇప్పటికే ఆడియన్స్ కు ఓ అవగాహన ఉంది.ఫస్ట్‌లుక్‌లో ఆ కాలం నాటి ఫొటోలో కీర్తి కళ్లు మాత్రమే చూపించారు.ఫొటో చూడగానే సావిత్రేనా అనిపించేంతగా కీర్తి ఆ పాత్రలో ఒదిగిపోయారు.రేపు ఏకంగా సావిత్రిలా కనిపించే కీర్తిసురేష్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. ఈ ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ కూడా రేపే రాబోతోంది.

మోహన్ బాబు ఎస్వీ రంగారావుగా, దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ గా కనిపించనున్న ఈ సినిమాలో షాలినీ పాండే, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, భానుప్రియ, దివ్యవాణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది మహానటి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news