Gossipsవిజయ్, సమంతలను వాడేస్తున్న మహానటి టీం..!

విజయ్, సమంతలను వాడేస్తున్న మహానటి టీం..!

మహానటి సావిత్రి బయోపిక్ గా నాగ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మహానటి. కీర్తి సురేష్ లీడ్ రోల్ గా నటిస్తున్న ఈ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నారు. మే లో రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత, విజయ్ లను ఎక్కువ వాడేస్తున్నారు.

 

వారిద్దరి మధ్య ఉన్న లవ్ ట్రాక్ సినిమాకు ప్లస్ అవుతుందని. సినిమాలో వారిద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు చుస్తే నిజంగా సమంత, విజయ్ ప్రేమలో ఉన్నారా అనుకునేంత అద్భుతంగా నటించారని చిత్ర వర్గాల సమాచారం. కమర్షియల్ గా కూడా సినిమా సక్సెస్ కు ఉపయోగపడుతుందని అలా చేస్తున్నారు. ఓ పక్క కీర్తి సురేష్ పిక్స్ రిలీజ్ చేస్తున్నా మహానటి నుండి విజయ్, సమంతల ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. అశ్వనిదత్ తనయురాలు ప్రియాంకా, స్వప్న దత్ లు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

 

మే రెండో వారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఆడియోని మే 1న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. సావిత్రి జీవిత కథతో వస్తున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడం జరిగింది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news