Moviesఏరియా ల వారీగా మహానటి 2 డేస్ కలక్షన్స్.. ఇది 'మహానటి...

ఏరియా ల వారీగా మహానటి 2 డేస్ కలక్షన్స్.. ఇది ‘మహానటి సావిత్రి’ ఘన విజయం..!

నాగ్ అశ్విన్ డైరక్షన్ లో మహానటి సినిమా మే 9న రిలీజ్ అయ్యింది. సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ సినిమా విపరీతమైన పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. ఎక్కడ చూసినా ఏ చోట విన్నా ప్రస్తుతం సినిమా అంటే మహానటే అన్నట్టుగా పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారీగానే రిలీజ్ అయిన ఈ మహానటి సినిమా యూఎస్ లో ప్రీమియర్స్ ద్వారానే భారీ మొత్తం వసూళ్లు రాబట్టింది.

ఇక మొదటి రోజే హాఫ్ మిలియన్ క్లబ్ లోకి చేరింది. తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మహానటి సందడి బాగానే ఉంది. స్టార్ సినిమా లేదు.. అనుకున్న రేంజ్ లో పబ్లిసిటీ కూడా లేదు కాని సినిమా మాత్రం ప్రేక్షకులను టచ్ చేసింది. ఇక ఈ సినిమా 2డేస్ కలక్షన్స్ వివరాలు చూస్తే వరల్డ్ వైడ్ గా 2.68 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది.

ఏరియాల వారిగా మహానటి కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

నైజాం : 1.24 కోట్లు

సీడెడ్ : 0.25 కోట్లు

ఉత్తరాంధ్ర : 0.37 కోట్లు

ఈస్ట్ : 0.19 కోట్లు

వెస్ట్ : 0.11 కోట్లు

గుంటూరు : 0.18 కోట్లు

నెల్లూరు : 0.7 కోట్లు

ఓవరాల్ గా మహానటి రెండు రోజుల్లో అంచనాలను మించి వసూళ్లను రాబట్టింది. సినిమాకు ఎలాగు మౌత్ టాక్ బాగుంది కాబట్టి కచ్చితంగా మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news