Movies2 మిలియన్ క్లబ్ లో మహానటి.. యూఎస్ లో సరికొత్త రికార్డ్..!

2 మిలియన్ క్లబ్ లో మహానటి.. యూఎస్ లో సరికొత్త రికార్డ్..!

సావిత్రి జీవిత కథతో నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా మహానటి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అక్కడ బాక్సాఫీస్ మీద మహానటి దూసుకెళ్తుంది. సినిమా రిలీజ్ ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ క్రాస్ చేసిన మహానటి మూవీ వారంలోనే 2 మిలియన్ డాలర్స్ వసూళ్లతో సంచలనం సృష్టించింది.

ఓవర్సీస్ లో తెలుగు సినిమా రేంజ్ చూపేలా ఈ సినిమా కలక్షన్స్ ఉన్నాయి. స్టార్ సినిమాలకు ధీటుగా మహానటి వసూళ్లు సాధించింది. 2 మిలియన్ క్లబ్ లో సగర్వంగా చేరిన మహానటి ఫుల్ రన్ లో మరో హాఫ్ మిలియన్ పైగా కలక్షన్స్ రబాడుతుందని అంచనా వేస్తున్నారు. కీర్తి సురేష్ అద్భుతమైన నటనతో వచ్చిన ఈ మహానటి సినిమాలో పాత్రధారులు ఎంతో గొప్పగా నటించారు.

వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమాను స్వప్నా దత్, ప్రియాంకా దత్ నిర్మించారు. తమిళ వర్షన్ కూడా మహానటి సినిమా మంచి వసూళ్లను రాబడుతుందని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news