Moviesమహానటిలో మధురవాణి మేకింగ్ వీడియో అదుర్స్..!

మహానటిలో మధురవాణి మేకింగ్ వీడియో అదుర్స్..!

సావిత్రి జీవిత కథతో వచ్చిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఎన్ని ప్రశంసలు అందుకుందో దానికి తగినట్టుగానే సినిమాలో మధురవాణి పాత్రలో నటించిన సమంత కూడా అదే రేంజ్ ప్రశంసలను అందుకుంది. అసలు ఓ స్టార్ హీరోయిన్ అయిన సాం ఆ రోల్ ఒప్పుకోవడమే గొప్ప విషయమని అంటున్నారు. జర్నలిస్ట్ రోల్ అనగానే ఆహా ఏముంటుంది అనుకుంటే సినిమా మొత్తం ఆమె ద్వారానే నడుస్తుంది.

ఇక క్లైమాక్స్ లో మధువరాణి పాత్ర ద్వారా సావిత్రి గొప్పతనం చెప్పించిన తీరు మహాద్భుతం. మధురవాణిగా సమంత, ఆమెని ప్రేమించే వ్యక్తి ఆంటోనిగా విజయ్ దేవరకొండ ఈ ఇద్దరు మహానటికి కొత్త కలర్ తెచ్చారు. ఇక మహనాటి ప్రమోషన్స్ లో భాగంగా మధురవాణి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఈ వీడియో మధురవాణిగా కనిపించేందుకు సమంత ఎంత కష్టపడ్డది.. ఆ షూటింగ్ విశేషాలు పొందుపరిచారు. ఫైనల్ గా ఆమె నత్తితో మాట్లాడే డైలాగ్ లో ఎండింగ్ లో ఉన్నారు. మొత్తానికి మహానటి సమంత వల్ల కూడా స్పెషల్ క్రేజ్ తెచ్చుకుందని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news