Newsమహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చూస్తే షాక్.. వీడియో వైరల్..!

మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చూస్తే షాక్.. వీడియో వైరల్..!

సావిత్రమ్మ జీవిత కథను తెర మీద ఆవిష్కరించిన మహానటి సినిమాలో టైటిల్ రోల్ పోశించిన కీర్తి సురేష్ ఇదవరకు ఉన్న ఇమేజ్ ను డబుల్, ట్రిపుల్ అయ్యేలా చేసింది ఈ సినిమా. సావిత్రి గారిలా అందం, అభినయం రెండిటిని మ్యాచ్ చేస్తూ కొన్ని కోట్ల హృదయాలను గెలుచుకుంది మలయాళ భామ కీర్తి సురేష్. ఇక సినిమాలో ఆమె నటన ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పలేం.

నటనే కాదు సినిమా కోసం సొంత డబ్బింగ్ కూడా చెప్పింది ఈ చిన్నది. తెలుగు నేర్చుకుని మరి నానా తంటాలు పడుతూ డబ్బింగ్ చెప్పింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహానటి కోసం కీర్తి సురేష్ ఎలా డబ్బింగ్ చెప్పిందో ఓ చిన్న ప్రోమో వదిలారు. తెలుగు భాషను ఇంత క్యూట్ గా డబ్బింగ్ చెబుతున్న కీర్తిని చూసి అందరు ముచ్చటపడుతున్నారు.

అంతేకాదు సినిమా అంత గ్రాండియర్ గా కనిపించడానికి ఎవరెవరు ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. ముఖ్యంగా ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ మహానటి కోసం కీర్తి సురేష్ డెడికేషన్ చూసి అందరు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ డబ్బింగ్ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రానున్న రోజుల్లో కీర్తి సౌత్ టాప్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news