Moviesమహానటి చేతిలో ఓడిపోయిన "అల్లు అర్జున్" సూర్య..!

మహానటి చేతిలో ఓడిపోయిన “అల్లు అర్జున్” సూర్య..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో వచ్చిన నా పేరు సూర్య బాక్సాఫీస్ దగ్గర నత్తనడక నడుస్తుంది. సినిమా కథ బాగున్నా దర్శకుడిగా వక్కతం వంశీది మొదటి సినిమా కాబట్టి బన్ని సినిమా రేంజ్ అందుకోలేదని అంటున్నారు. ఇక కలక్షన్స్ సంగతి ఎలా ఉన్నా నిన్న రిలీజ్ అయిన మహానటి మూవీ మాత్రం యూఎస్ లో అల్లు అర్జున్ నా పేరు సూర్య రికార్డ్ బ్రేక్ చేసింది.

సూర్య సినిమా ప్రీమియర్స్ కలక్షన్స్ కన్నా మహానటి సినిమా ప్రీమియర్స్ కలక్షస్ ఎక్కువగా సాధించింది. ప్రీమియర్స్ తోనే 3 లక్షల డాలర్స్ వసూళు చేసింది మహానటి మూవీ. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. ఓ రకంగా మహానటి చేతిలో సూర్య ఓడిపోయాడని చెప్పాలి.

ఇక మరో పక్క రేపు రిలీజ్ అవుతున్న పూరి మెహబూబా మీద కూడా ఈ సినిమా ఎఫెక్ట్ చూపించక మానదు. అసలే పూరి సినిమాలు ఈమధ్య వరుస ఫ్లాపులవుతున్నాయి. తనయుడితో మనసు పెట్టి చేశానంటున్న పూరి మెహబూబా మహానటిని క్రాస్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news