Gossipsశ్రీ దెబ్బకు కాళ్ళ బేరానికి వచ్చిన MAA

శ్రీ దెబ్బకు కాళ్ళ బేరానికి వచ్చిన MAA

గత కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమ లోని పెద్దలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సమస్య శ్రీ రెడ్డి లీక్స్. పరిశ్రమలోని కొంత మంది బడా బాబులు తనకి హీరోయిన్ గ అవకాశాలు ఇస్తానని చెప్పి తనని శారీరకంగా వాడుకుని మోసం చేసారు అని శ్రీ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దానికి సాక్ష్యం గ తన వద్ద ఉన్న ఇండస్ట్రీ కి చెందిన కొంత మంది పెద్దల వాట్సాప్ చాట్స్ ని, తనతో సన్నిహితంగా దిగిన కొన్ని ఫోటోలని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సమస్యని ఇంతటితో వదిలేయకుండా ఫిలిం నగర్ లోని మా కార్యాలయం ముందు అర్ధ నగ్న ప్రదర్శనకి దిగింది.

శ్రీ రెడ్డి నిరసన చేసిన విధానం సరైన పద్దతి కాదంటూ ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా తెలిపారు. శ్రీరెడ్డి విషయంలో ఆ రోజు చలన చిత్ర వాణిజ్య మండలి ఆవరణలో జరిగిన సంఘటనపై మనస్తాపం చెంది ‘మా’ సభ్యులెవరూ ఆమెతో కలిసి నటించకూడదని నిర్ణయం తీసుకున్నారు. కానీ తాజాగా సినీ పరిశ్రమలోని పెద్దలు ఆ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని అడిగారని సమాచారం.

దీంతో నిన్న గురువారం తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో విలేకర్ల సమావేశం జరిగింది ఈ సమావేశం లో శివాజీరాజా మాట్లాడుతూ గతంలో శ్రీ రెడ్డి మీద విధించిన బ్యాన్ ని ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)లో ఉన్న 900 మంది సభ్యులూ శ్రీరెడ్డితో కలిసి నటించొచ్చన్నారు. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల్ని అడ్డుకునేందుకు “కమిటీ ఎగెనెస్ట్‌ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ (క్యాష్‌)” పేరుతో బయటి వాళ్లతోనూ, చిత్ర పరిశ్రమ వ్యక్తులతోనూ కలిపి ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ ”ఎవరికైనా అవకాశాలు దర్శకనిర్మాతలే ఇవ్వాలి. కానీ కొంతమంది సభ్యులకి అవకాశాలు ఇప్పించేందుకు ‘మా’ ప్రయత్నం చేస్తుంటుంది. ఆ మధ్య తేజగారికి ఫోన్‌ చేసి అడిగితే ఆయన శ్రీరెడ్డికి అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ‘మా’ సభ్యత్వం అనేది మాత్రం కమిటీ నిర్ణయించాల్సిన విషయం” అన్నారు.

చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు జెమినీ కిరణ్‌ మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ లో ఆడవారి పై జరుగుతున్న వేధింపుల పైన ఇక నుండి “క్యాష్” కమిటీ పని చేస్తుందని చెప్పారు. ఎవరి పై అయినా ఆరోపణులు వస్తే తగిన సాక్ష్యాలు ఉంటె కమిటీ తీవ్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది అని తెలిపారు.
నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఈ కమిటీ మీద ఎవ్వరికీ అనుమానాలు అవసరం లేదు, ఇందులో పరిశ్రమలోని పెద్దలతో పటు ఇతర సంస్థలకి చెందిన సభ్యులు కూడా ఉన్నారని తెలిపారు. సినీ పరిశ్రమ లో పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా చాల ఉన్నాయని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news