Moviesఈ సినిమాకు.. టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కు లింకేంటి ..!

ఈ సినిమాకు.. టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కు లింకేంటి ..!

తీగ లాగితే డొంక కదిలినట్టు టాలీవుడ్ లో సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో ఎన్నో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు ఈ డ్రగ్స్ టాలీవుడ్ కు ఎలా అలవాటైంది.. డ్రగ్స్ లిస్ట్ లో టాలీవుడ్ లో ఉన్న ప్రముఖులు ఎవరు. బయటకు వస్తున్న కొంతమంది పేర్లలో ఎవరు నిజమైన డ్రగ్ ఎడిక్ట్స్.. ఎవరు కాదు అన్నది ఇంకా తెలియలేదు.
అయితే ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చేలా చేసింది మాత్రం కచ్చితంగా ఓ యువ హీరో అని తెలుస్తుంది. అతని చేసిన చిన్న పొరపాటు వల్లే ఈ మాఫియా బట్టబయలు అయ్యింది. ఓ పక్క డ్రగ్స్ విషయంలో టాలీవుడ్ అంతా హాట్ హాట్ గా ఉన్న ఈ సందర్భంలో ఇలాంటి కథాంశంతోనే వచ్చిన నాకు నేనే (తోపు,తురుము) సినిమా గురించి అందరు మాట్లాడుతున్నారు.
కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో పొలిటికల్ పంచ్ అదిరిపోతుందట. ఇందులో హీరో ఒక రాష్ట్రానికి సిఎంగా ఉండి ప్రజలకు వరాల జల్లు కురిపిస్తాడు.. మధ్యపానం హోం డెలివెరీ.. రేషన్ షాపుల్లో పాన్, సిగరెట్, గుట్కా, గంజాయి లాంటివి ఉచితంగా ఇవ్వడం లాంటివి ఉంటాయట. అయితే రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. వారిని అవాక్కయ్యేలా చేసిందట. డ్రగ్స్ కు అలవాటు పడిన మనిషి ఎలాంటి పరిస్థితులకు దిగజారుతాడు అన్న కథాంశంతో మంచి మెసేజ్ ఇచ్చే సినిమాగా వచ్చిందట నాకు నేనే (తోపు,తురుము).
ఇక ఈ సినిమా అలాంటి వారిని ఉదాహరణగా తీసుకుని తీసినట్టు చెప్పడంతో డ్రగ్స్ రాకెట్ అక్కడ బయటకు పొక్కిందని అంటున్నారు. ఈ సినిమా వల్లే టాలీవుడ్ డ్రగ్ ఎడిక్ట్స్ బయటకు వచ్చారంటూ వాదన వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.
ఇక అసలే వ్యవహారం హాట్ హాట్ గా నడుస్తుండగా నాకు నేనే (తోపు,తురుము) ఈ నెల 28న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా చూస్తే నిజంగానే ఈ సినిమాకు డ్రగ్స్ నిందితులకు ఏదైనా సంబంధం ఉందా అన్నది తెలుస్తుంది.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news