Gossipsసినిమా హిట్ అయినా ప్రొడ్యూసర్స్ కి టెన్షన్

సినిమా హిట్ అయినా ప్రొడ్యూసర్స్ కి టెన్షన్

నాచురల్ స్టార్ గా నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో కూడా ఎం.సి.ఏ అంటూ వచ్చి హిట్ అందుకున్న నాని ఈ ఇయర్ కృష్ణార్జున యుద్ధంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాలో నాని డ్యుయల్ రోల్ చేశాడు. అయితే నాని మార్క్ ఎంటర్టైనర్ గా వచ్చినా సరే కృష్ణార్జున యుద్ధం వసూళ్లు సాధించడం కష్టమే అని అంటున్నారు.

ఏడాదికి 3 సినిమాలు చేస్తున్న నాని 4 నెలలకు ఒకటి రిలీజ్ చేస్తున్నాడు. అయితే ఎం.సి.ఏ సినిమా కూడా గొప్ప కథే కాదు ఇక వచ్చిన కృష్ణార్జున యుద్ధం సినిమా కూడా కథ కథనాల్లో అంత గ్రిప్పింగ్ గా లేకపోవడం నాని హిట్ మేనియాకు ఈ సినిమా బ్రేక్ వేసిందని అంటున్నారు. అంతేకాదు ఆల్రెడీ రాం చరణ్ రంగస్థలం ఇంకా బాక్సాఫీస్ మీద తన ప్రతాపం చూపిస్తుంది.

లాస్ట్ వీక్ వచ్చిన ఛల్ మోహన్ రంగ కూడా బాగానే నడుస్తుంది. ఇక నాని కృష్ణార్జున యుద్ధం సినిమాకు థియేటర్లు కూడా తక్కువే కేటాయించారు. ఈ లెక్క చూస్తే టాక్ ఎలా ఉన్నా నానికి ఈ సినిమా పెద్ద లాభం తీసుకురాదని చెప్పొచ్చు. ఈ సినిమాను దిల్ రాజు కొని రిలీజ్ చేశారు. మరి ఆయన ఏ స్ట్రాటజీతో కొన్నాడో తెలియాల్సి ఉంది.

http://www.telugulives.com/telugu/nani-krishnarjuna-yuddham-movie-review-rating/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news