Moviesరిలీజ్ కు ముందే కష్టాలలో కృష్ణార్జున యుద్ధం

రిలీజ్ కు ముందే కష్టాలలో కృష్ణార్జున యుద్ధం

నాచురల్ స్టార్ నాని హీరోగా మేర్లాపాక గాంధి డైరక్షన్ లో వస్తున్న సినిమా కృష్ణార్జున యుద్ధం. రేపు రిలీజ్ అవనున్న ఈ సినిమా మీద నాని బజ్ తెచ్చేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా సరే అసలు ఏమాత్రం రావట్లేదు. వరుస సక్సెస్ లను అందుకుంటున్నా సరే నాని మూడు నెలలకో సినిమా అయ్యే సరికి నాని ఎన్ని సినిమాలు చేస్తున్నా సినిమాలైతే సక్సెస్ కొడుతున్నాడు కాని క్యారక్టరైజేషన్ మాత్రం కొనసాగిస్తున్న భావనే ఉంది.

అందుకే నాని లేటెస్ట్ మూవీ కృష్ణార్జున యుద్ధం సినిమాకు అంత పాజిటివ్ బజ్ ఏర్పడలేదు సరికదా సినిమా మీద జనాల ఆసక్తి కూడా లేదని టాక్. ఈ విషయం తెలుసుకున్నాడు కనుకనే కేవలం ఒక్క రోజు ముందు ఈ సినిమా ప్రమోషన్స్ అది కూడా నామమాత్రంగానే చేస్తున్నాడని అంటున్నారు. మొత్తానికి రిలీజ్ కు ముందే నానికి కృష్ణార్జున యుద్ధం దెబ్బేసిందని చెప్పొచ్చు.

నాని ఈ సినిమా నెగటివ్ రిజల్ట్ అందుకుంటే మాత్రం మళ్లీ హిట్ కొట్టేందుకు కష్టపడాల్సిందే. మరి నాని 2018 కలిసి వస్తుందా లేదా అన్నది రేపు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news