Gossipsరామ్ చరణ్ కి మళ్ళీ హ్యాండ్ ఇచ్చిన కొరటాల శివ ?

రామ్ చరణ్ కి మళ్ళీ హ్యాండ్ ఇచ్చిన కొరటాల శివ ?

మహేష్‌తో ‘భరత్‌ అనే నేను’ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా వున్న కొరటాల శివ తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్‌తో ప్లాన్‌ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. జనతా గ్యారేజ్‌ చేస్తున్నపుడే ఎన్టీఆర్‌తో ఇంకో చిత్రం చేయడానికి కొరటాల కమిట్‌ అయ్యాడు.

అయితే మహేష్‌ చిత్రంతో పాటు చరణ్‌తో ఒక చిత్రం పూర్తి చేసిన తర్వాత ఇది సెట్స్‌ మీదకి వెళుతుందని వార్తలొచ్చాయి. చరణ్‌తో ప్రాజెక్ట్‌ కోసం కొరటాల శివ చాలా రోజుల పాటు చరణ్‌తో డిస్కషన్స్‌ జరిపాడు. ఆమధ్య చరణ్‌ ఎక్కడ వున్నా పక్కన కొరటాల కూడా కనిపించడంతో ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయిపోయిందనే అనుకున్నారు. కానీ తాజా పరిణామాల బట్టి చరణ్‌తో ప్రాజెక్ట్‌ కొరటాల డ్రాప్‌ అయినట్టు తెలుస్తోంది.

కొరటాలతో ఎన్టీఆర్‌ చిత్రం తెర మీదకి రావడంతో చరణ్‌ సినిమా వెనక్కి జరిగిందని అర్థమవుతోంది. చరణ్‌తో కొరటాల ఎప్పుడో సినిమా చేయాల్సింది. బండ్ల గణేష్‌ నిర్మాణంలో సినిమా అనౌన్స్‌ కూడా అయి ఆగిపోయింది. అది వదిలేసుకుని చరణ్‌ ‘గోవిందుడు అందరివాడేలే’ చేస్తే, కొరటాల ఆ ప్లేస్‌లో ‘శ్రీమంతుడు’ చేసాడు.

బ్లాక్‌బస్టర్‌ దర్శకుడితో చరణ్‌ సినిమా ఈసారి ఖాయమని ఫాన్స్‌ ఆనందిస్తూ వుంటే ఇప్పుడీ న్యూస్‌ వారిని డిజప్పాయింట్‌ చేసింది. ఇదిలావుంటే చరణ్‌తో సినిమా చేయడానికి దిల్‌ రాజు కమిట్‌ అయ్యాడు. ఒక స్టార్‌ దర్శకుడు చేస్తాడని చెబుతోన్న ఈ ప్రాజెక్ట్‌ని ఎవరి చేతుల్లో పెడతారో మరి?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news