Moviesకొరటాలతో బన్ని.. కాంబో సెట్ అయితే ఫ్యాన్స్ కు పండుగే..!

కొరటాలతో బన్ని.. కాంబో సెట్ అయితే ఫ్యాన్స్ కు పండుగే..!

రైటర్ నుండి డైరక్టర్ గా ప్రమోట్ అయిన కొరటాల శివ ప్రభాస్ తో మిర్చి, మహేష్ తో శ్రీమంతుడు, ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్ ఇలా సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ తో “భరత్ అను నేను” సినిమా చేస్తున్న కొరటాల శివ ఈసారి స్టైలిష్ స్టార్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడని లేటెస్ట్ అప్డేట్.

అల్లు అర్జున్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో వస్తున్న నా పేరు సూర్య సినిమా పూర్తి కాగానే లింగుసామి, విక్రం కుమార్ లైన్లో ఉన్నాడు. మరి వారిద్దరిని కాదని బన్ని కొరటాలతో సినిమా తీస్తాడా అన్న డౌట్ కూడా ఉంది. కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో తెలియదు కాని ఈ కాంబో సినిమా వస్తే కచ్చితంగా రికార్డులు బద్ధలే అని చెప్పొచ్చు.

సినిమాకు తన స్టామినా ప్రూవ్ చేసుకుంటున్న బన్ని కొరటాలతో అది కూడా ఓ సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అంటే ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు. అసలైతే మహేష్ సినిమా తర్వాత రాం చరణ్ సినిమా కమిట్ అయిన కొరటాల శివ అది పూర్తి చేశాక బన్నితో సినిమా సెట్ చేసుకుంటున్నాడట. ఇప్పటికే ఓ కథ అనుకోవడం జరిగిందట. త్వరలో బన్నితో శివ స్టోరీ సిట్టింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news