Gossipsపెళ్లిపీటలు ఎక్కబోతున్న నమిత వరుడు ఎవరో తెలుసా ..?

పెళ్లిపీటలు ఎక్కబోతున్న నమిత వరుడు ఎవరో తెలుసా ..?

బొద్దుగుమ్మ నమిత పెళ్లి అని ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ విషయం ను స్వయంగా నమిత అనౌన్స్ చేయడం విశేషం. ఇంతకీ నమితను పెళ్లాడబోయే వ్యక్తి ఎవరు ..? అనే ఉత్కంట అందరిలోనూ కలిగింది . ఇంతలో ఈ నెల 24 న తమిళ నటుడు వీరాతో తన పెళ్లి జరగబోతోందంటూ అనౌన్స్ చేసింది నమిత.

తమిళంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన రజియా విల్సన్ తో పాటు మరికొందరు, నమిత తో కలిసి సోషల్ మీడియాలో ఈ అనౌన్స్ మెంట్ చేశారు. నవంబర్ 24న తన ప్రేమికుడితో వివాహం తిరుపతిలో జరగబోతున్నట్టు  చెప్పుకొచ్చింది. ప్రేక్షకులు తమను ఎప్పుడూ ఇలాగే ఆదరించాలంటూ కోరింది నమిత. ఇంతకూ ఈ వీరా అంటే ఎవరు అనేదేగా మీ డౌట్. వీరా పెద్ద ఫ్యామస్ కాదు గానీ, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తుంటాడు.

‘సొంతం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నమిత. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకొంది. తెలుగులో ఆమె నటించిన ‘ఒక రాజు ఒక రాణి’, ‘జెమిని’, ‘జగన్మోహిని’, ‘బిల్లా’, ‘సింహా’ సినిమాలతో ఆకట్టుకొంది. సూపర్ స్టార్ మోహన్ లాల్ ‘మన్యం’లో ఈ ముద్దుగుమ్మ మెరిసింది. బిగ్ బాస్ తమిళ్ వర్షన్ సీజన్ లో పాల్గొంది. ప్రస్తుతం తమిళ వాది ఉదయన్ దర్శకత్వంలో నమిత ఓ సినిమా చేస్తోంది. ఇందులో భరత్ కు జంటగా నమిత నటిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news