Gossipsకిరాక్ పుట్టించిన కలెక్షన్లు....లెక్క ఎంత..?

కిరాక్ పుట్టించిన కలెక్షన్లు….లెక్క ఎంత..?

స్వామిరారా సినిమా తో హిట్ ట్రాక్ అందుకున్న నిఖిల్ అభిమానుల కోసం అదేతరహాలో సినిమాలు తీస్తున్నాడు.కన్నడ సినిమా రీమేక్ లో వచ్చిన సినిమా కిరాక్‌పార్టీ ఈ సినిమా లో ప్రధానపాత్రలో నిఖిల్ తన నటనతో అభిమానుల్ని మెప్పించాడు.
ఈ సినిమా శుక్రవారం(మార్చి 16) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రస్తుతం ఈ వారం విడుదలైన తెలుగు సినిమాలలో అంతగా ప్రేక్షకుల మెప్పించే సినిమా ఏమి లేకపోవడంతో కిరాక్‌పార్టీ వసూళ్లలో దూసుకుపోతుంది.నిఖిల్‌కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా వీకెండ్‌లో ఈ సినిమా కలెక్షన్స్‌ పరంగా దుమ్ముదులిపింది.
దీంతో మూడు రోజుల్లో దాదాపు పదికోట్ల వసూళ్లను సాధించింది. కిరాక్‌పార్టీ హవా ఇలాగే కొనసాగితే…వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సుధీర్‌ వర్మ స్క్రిప్ట్‌ను, చందూ మొండేటి మాటలను అందించగా శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news