Moviesఖైదీ నంబర్ 150 పది రోజుల కలెక్షన్లు.. ఇంకా కొనసాగుతున్న మెగా...

ఖైదీ నంబర్ 150 పది రోజుల కలెక్షన్లు.. ఇంకా కొనసాగుతున్న మెగా సునామి !!

బాక్స్ ఆఫీస్ దగ్గర ‘మెగా సర్జికల్ స్ట్రైక్’ ఇంకా కొనసాగుతూనే ఉంది…మెగా సునామీ అంటే ఏంటో చూపిస్తున్నాడు మెగాస్టార్. ఆ ఏరియా ఈ ఏరియా అంటూ తేడాలేకుండా అన్ని ఏరియాల్లో తన స్టామినా ఏంటో రుచి చూపిస్తున్నాడు. మహేష్ బాబు కొరటాల శివ ల శ్రీమంతుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 85.2 కోట్ల షేర్ (145 కోట్ గ్రాస్) రాబట్టాడు. ఖైదీ నంబర్ 150 పదిరోజుల్లోనే ఆ కలెక్షన్లకు దగ్గరైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 84 కోట్ల పైనే షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక శ్రీమంతుడు ని దాటటం నామ మాత్రమే.

10 రోజులకి గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి:

నైజాం – రూ. 15. 12 కోట్లు

గుంటూరు – రూ. 6.04 కోట్లు

కృష్ణా – రూ. 4.62 కోట్లు

వెస్ట్ – రూ. 5.28 కోట్లు

ఈస్ట్ – రూ. 6.94 కోట్లు

సీడెడ్ – రూ. 12.00 కోట్లు

నెల్లూరు – రూ. 2.76 కోట్లు

వైజాగ్ – రూ. 10.01 కోట్లు

పదిరోజుల్లో ఏపీ తెలంగాణ మొత్తం వసూళ్లు – రూ. 62. 77 కోట్లు (షేర్)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news