యూఎస్ బాక్సాఫీస్‌ని దుక్కి దున్నేసిన ‘ఖైదీ’.. ఆ మార్క్‌ని అవలీలగా క్రాస్ చేసిన బాస్

khaidi no 150 usa premieres collections

Megastar Chiranjeevi’s ‘Khaidi No 150’ movie has earned remarkable collections from 123 locations through USA locations. This is the humongous record of all time in south industry.

మెగాస్టార్ చిరంజీవి మైల్‌స్టోన్ 150వ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’పై తారాస్థాయిలో అంచనాలు నెలకొన్న నేపథ్యంలో.. ఈ చిత్రం ఊహించని రికార్డులు క్రియేట్ చేయవచ్చునని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఈ సినిమా అప్పుడే రికార్డుల మోత ప్రారంభించింది. ఇండియాలోకంటే ఒకరోజు ముందేగానే యూఎస్‌లో ప్రీమియర్ షోస్ వేయగా.. అక్కడి బాక్సాఫీస్‌ని ఈ చిత్రం దుక్కి దున్నేసింది. మిలియన్ మార్క్‌ని క్రాస్ చేసేసింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం యూఎస్‌ ప్రీమియర్స్ ద్వారా టోటల్ 123 లొకేషన్స్ నుంచి $1,133,615 కలెక్ట్ చేసింది. ఇంకా మిగిలిన ఏరియాల వివరాలు తెలియాల్సి ఉంది. అవి కూడా కలుపుకుంటే.. ‘బాహుబలి’ ($1.36 మిలియన్) రికార్డ్ బద్దలవ్వడం ఖాయమని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత చిరు రీఎంట్రీ ఇవ్వడంతో.. ఈ చిత్రం రీమేకా? కాదా? అన్నది ఏమాత్రం పట్టించుకోకుండా యూఎస్ ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారని.. అందుకే ప్రీమియర్స్ రూపంలోనే ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టిందని అంటున్నారు. మెగాస్టార్ క్రేజ్ అంటే ఇది.

ఇదే రేంజ్‌లో ఈ లాంగ్ వీకెండ్ మొత్తంలో ‘ఖైదీ’ దూకుడు ప్రదర్శిస్తే.. ఇది 4 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించగా.. తరుణ్ అరోరా విలన్ పాత్ర పోషించాడు.

More from my site