Movies‘ఖైదీ నెంబర్ 150’ యూఎస్ ప్రీమియర్ ఫైనల్ కలెక్షన్స్.. కొద్దిలో ‘బాహుబలి’...

‘ఖైదీ నెంబర్ 150’ యూఎస్ ప్రీమియర్ ఫైనల్ కలెక్షన్స్.. కొద్దిలో ‘బాహుబలి’ రికార్డ్ మిస్

Trade analysts finally reveals the final us premiers collections of Khaidi no 150 which is STUPENDOUS start. But this movie failed to beat Baahubali record.

దాదాపు దశాబ్దకాలం తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. అంచనాలకు తగ్గట్టుగానే రికార్డుల మోత ప్రారంభించాడు. యూఎస్ బాక్సాఫీస్‌ వద్ద ప్రకంపనలు సృష్టించాడు. ఏకంగా మిలియన్ మార్క్‌నే క్రాస్ చేసేశాడు. అవును.. చాలామంది హీరోలకు ఇప్పటికీ అది డ్రీమ్ మార్క్ అయితే.. దాన్ని ఒక్కరోజులోనే క్రాస్ చేసేసి తన స్టామినా ఏంటో చిరు నిరూపించుకున్నారు.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం యూఎస్ ప్రీమియర్స్ ద్వారా $ 1,251,548 (రూ. 8.56 కోట్లు) కలెక్ట్ చేసింది. అయితే.. కొద్దిలో ‘బాహుబలి’ ($1.36M)రికార్డ్‌ని మిస్ చేసుకుంది. ఏదేమైనా.. ఆ రేంజ్ కలెక్షన్లతో ‘నాన్-బాహుబలి’ రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం అంటున్నారు. చాలాకాలం తర్వాత చిరు రీఎంట్రీ ఇస్తుండడంతో ఈ చిత్రానికి ఎనలేని క్రేజ్ వచ్చిపడిందని, అందుకే ప్రీమియర్స్ ద్వారా అంతమొత్తం కలెక్ట్ చేసిందని అంటున్నారు. ఈ చిత్రం ఇదే దూకుడు కొనసాగిస్తే.. టోటల్ రన్‌లో 4 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news