Movies‘ఖైదీ నెంబర్ 150’ రెండు రోజుల కలెక్షన్స్.. షాకింగ్ రిపోర్ట్

‘ఖైదీ నెంబర్ 150’ రెండు రోజుల కలెక్షన్స్.. షాకింగ్ రిపోర్ట్

khaidi no 150 two days collections report is out. In the second day this movie has earned low amount because of gautamiputra satakarni release.

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన హంగామా అంతాఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా రూ. 37.28 కోట్లు (షేర్) కొల్లగొట్టి ‘నాన్-బాహుబలి’ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో రూ.25.05 కోట్లు (షేర్) కలెక్షన్లు రాబట్టి ఏకంగా ‘బాహుబలి’నే బీట్ చేసింది. దీంతో.. తెలుగు స్టేట్స్‌లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ఖైదీ’ చరిత్ర సృష్టించింది. అయితే.. రెండోరోజు మాత్రం ఈ మూవీ కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో రెండోరోజు (గురువారం) కేవలం రూ.5.68 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే.. మొత్తం రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ చిత్రం రూ.30.73 కోట్లు రాబట్టిందన్నమాట. గురువారంనాడు బాలయ్య ప్రతిష్టాత్మక వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రిలీజ్ అవ్వడం వల్లే.. రెండోరోజు ‘ఖైదీ’ అంత తక్కువ కలెక్ట్ చేసిందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయినా.. అంతమొత్తం కలెక్ట్ చేయడం విశేషమేనని చెబుతున్నారు. ఇంకా ఇతర ఏరియాల వివరాలు తెలియాల్సి ఉంది.

ఏరియాల వారీగా రెండు రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 8.71
సీడెడ్ : 4.90
నెల్లూరు : 1.17
కృష్ణా : 1.90
గుంటూరు : 3.13
వైజాగ్ : 3.95
ఈస్ట్ గోదావరి : 3.81
వెస్ట్ గోదావరి : 3.16
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 30.73 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news