Moviesమెగాస్టార్ స్టామినా అంటే ఇది.. యూట్యూబ్‌ని ఓ కుదుపు కుదిపేసిన ‘ఖైదీ’...

మెగాస్టార్ స్టామినా అంటే ఇది.. యూట్యూబ్‌ని ఓ కుదుపు కుదిపేసిన ‘ఖైదీ’ టీజర్

Megastar Chiranjeevi’s latest prestigeous project Khaidi No 150 teaser has already started breaking records on social media. According the latest updates, this teaser has got highest views ever than telugu teaser in Tollywood in just 15 hours span.

మెగాస్టార్ చిరంజీవి తిరిగి రీఎంట్రీ ఇస్తున్నారనే వార్త వెలువడినప్పటి నుంచి.. ఆయన చిత్రం రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలవడం ఖాయమని చెప్పుకున్నాం.. ఫస్ట్‌లుక్ నుంచే సోషల్ మీడియాలో ‘ట్రెండ్’ సెట్ చేస్తుందని అనుకున్నాం.. అలా అనుకున్నట్లుగానే ఆ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. ఆమధ్య ఫస్ట్‌లుక్ పోస్టర్స్ రిలీజ్ అవ్వగా.. దేశవ్యాప్తంగా దాదాపు ఓ గంటపాటు ఫస్ట్ పొజిషన్‌లో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇప్పుడు ఈ మూవీ టీజర్‌ని యూట్యూబ్‌ని ఓ కుదుపు కుదిపేసింది. ఇంతవరకు ఏ ఒక్క తెలుగు చిత్రం రాబట్టిన వ్యూస్‌తో చరిత్ర సృష్టించింది.

ముందుగా కొణిదెలవారు ప్రకటించినట్లుగానే ఈ టీజర్‌ని గురువారం (08-12-2016) సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయగా.. కేవలం 3 గంటల 5 నిముషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. అలాగే.. 30 వేలకు పైగా లైక్స్ రాబట్టింది. అంత తక్కువ టైంలో అన్ని వ్యూస్‌తోపాటు లైక్స్ రాబట్టిన తొలి తెలుగు టీజర్ ఇదే కావడంతో.. దీన్ని ఆల్‌టైమ్ రికార్డ్‌గా పేర్కొంటున్నారు. ఇక తాజాగా ఈ టీజర్ మరో వరుదైన ఘనత సాధించింది. 15 గంటల్లోనే 2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అంతేకాదు.. 56 వేలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి. ఈ రేంజులో ఒక టీజర్‌కి రెస్పాన్స్ రావడం టాలీవుడ్ సినిమాల్లో అసాధ్యమైన విషయంగా చెప్పేయాలి. మొత్తానికి.. మెగాస్టార్ మేనియా ముందు యూట్యూబ్ రికార్డులు చిన్నబోయాయని చెప్పుకోవచ్చు. తొమ్మిదేళ్ల గ్యాప్ వచ్చిన తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ఈ టీజర్‌తో చిరు తేల్చేశాడు.

కాగా.. ఈ మూవీ ఆడియో వేడుక ఈనెల 25వ తేదీన జరపనున్నారు. ఆరోజే ట్రైలర్‌ కూడా విడుదల చేయనున్నట్లు యూనిట్ వెల్లడించింది. రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ మూవీని జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news