Moviesఅక్కడ ప్రిన్స్‌ని దాటేసిన ఖైదీ.. కర్ణాటకలో డీల్ ఫిక్స్

అక్కడ ప్రిన్స్‌ని దాటేసిన ఖైదీ.. కర్ణాటకలో డీల్ ఫిక్స్

Khaidi No 150 movie unit has revealed Overseas and Karnataka rights details. According to their updates, Megastar Chiranjeevi broke Mahesh Babu’s record in overseas and created alltime record. In Karnataka region also this movie rights has been sold for bomb price which is also a alltime record.

మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ రికార్డ్ స్థాయిలో బిజినెస్ చేస్తోంది. చాలాకాలం తర్వాత చిరు మొహానికి రంగు పూసుకుని, కెమెరా ముందుకు వస్తుండడంతో.. మొదటినుంచే ఈ చిత్రంపై తారాస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఆ క్రేజ్ కారణంగానే.. డిస్ట్రిబ్యూటర్లు భారీ రేట్లకు రైట్స్ సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఆంధ్రాలోని అన్ని ఏరియాల్లోనూ ‘బాహుబలి’ కంటే అత్యధిక రేట్లకు అమ్ముడుపోయి.. ఆల్‌టైమ్ రికార్డ్స్ సృష్టించింది. ఇక నైజాం రైట్స్‌ని ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అక్షరాల రూ.21 కోట్లకు సొంతం చేసుకున్నాడు. తాజాగా ఓవర్సీస్, కర్ణాటక రైట్స్‌కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది.

యూనిట్ వర్గాల వెల్లడించిన సమాచారం ప్రకారం.. ‘ఖైదీ’ మూవీ ఓవర్సీస్ రైట్స్‌ని క్లాసిక్ ఎంటర్టైన్‌మెంట్ అనే డిస్ట్రిబ్యూషన్ అక్షరాల రూ.13.5 కోట్లకు తీసుకుంది. గతంలోనే ఈ వార్త వచ్చింది కానీ.. అప్పట్లో డీల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. రేటుని కాస్త తగ్గించుకోమని వాళ్లు డిమాండ్ చేయడం, కుదరదని యూనిట్ సమాధానం ఇస్తుండడంతో.. ఈ డీల్ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి.. ఇప్పుడు డీల్ ఓకే అయ్యింది. ఈ దెబ్బతో.. ఓవర్సీస్‌లో మహేష్ క్రియేట్ చేసిన రికార్డ్ బద్దలైపోయింది. అతని ‘బ్రహ్మోత్సవం’ చిత్రం అప్పట్లో రూ.13 కోట్లకు అమ్ముడుపోయింది. ఇప్పుడు దాన్ని ‘ఖైదీ’ దాటేసి.. ఆల్‌టైం రికార్డ్‌ని సృష్టించాడు. మరి.. టోటల్ రన్‌లో అంతమొత్తం వసూలు చేస్తాడా? లేదా? వెయిట్ చేయాలి.

ఇక ఇదే సమయంలో కర్ణాటక రైట్స్ వివరాల్ని కూడా యూనిట్ వెల్లడించింది. అక్కడ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్‌గా పేరుగాంచిన ‘బృందా అసోసియేట్స్’వారు ఈ చిత్రం హక్కుల్ని ఫ్యాన్సీ ధరకే కొనుగోలు చేసినట్లు చిత్రటీం స్పష్టం చేసింది. ఎంతకు కొన్నారో తెలీదు కానీ.. ఆ రేటు కూడా కర్ణాటకలో ఆల్‌టైం రికార్డేనని వార్తలొస్తున్నాయి. మొత్తానికి.. చిరు చిత్రం లోకల్‌లోనే కాకుండా నాన్‌లోకల్‌లోనూ బిజినెస్ అదరగొట్టేస్తోందన్నమాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news