‘శాతకర్ణి’ దెబ్బకి ‘ఖైదీ’ పరుగు..?

khaidi no 150 movie planning postpone release satakarni trailer

Khaidi no 150 movie unit planning to postpone their release date because they don’t want to clash with Gautamiputra Satakarni which is getting huge response from all over and such a hype in social media. But this news not confirmed yet.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ రిలీజ్ కాకముందు ‘ఖైదీ నెంబర్ 150’పైనే ఎక్కువ అంచనాలు ఉండేవి. అందుకు కారణం.. ఆయన చాలాకాలం తర్వాత రీఎంట్రీ ఇస్తుండడమే! అందునా.. ఇది ఆయన 150వ చిత్రం కావడంతో దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. పైగా.. ఈ మూవీ సబ్జెక్ట్ (తమిళ ‘కత్తి’) ఓ సోషల్ మెసేజ్‌తో కూడి ఉండడం మరింత కలిసొచ్చింది. మరోవైపు.. బాలయ్య చేస్తున్న ‘శాతకర్ణి’ సినిమా చారిత్రక కథాంశం కావడంతో.. అది జనాలను అంతగా ఆకట్టుకోకపోవచ్చునని అనుకున్నారు. దీంతో.. ఈసారి జరగబోయే సంక్రాంతి పోరులో చిరుదే పైచేయ్యి కావచ్చునని భావించారు.

కానీ.. ఎప్పుడైతే ‘శాతకర్ణి’ ట్రైలర్ రిలీజయ్యిందో అంచనాలన్నీ తారుమారయ్యాయి. ట్రైలర్‌లో చూపించిన అద్భుతమైన విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండడంతో.. సాధారణ ప్రేక్షకుల దగ్గర నుంచి దిగ్గజాలు సైతం దానికి దాసోహం అయిపోయారు. దీంతో.. ‘శాతకర్ణి’ సినిమాకి ఎనలేని క్రేజ్ వచ్చిపడింది. ఈ దెబ్బకి మెగా రేటింగ్ పడిపోయింది. ‘ఖైదీ నంబర్ 150’ కన్నా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కే పాపులారిటీ ఎక్కువగా వస్తోంది. ఈ విషయం గ్రహించిన మెగా యూనిట్.. తమ మూవీని వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్లు జోరుగా ప్రచారం చేస్తోంది. ‘శాతకర్ణి’తో పోటీ పడడం కంటే.. సోలోగా వచ్చి హిట్ సంపాదించాలనే ఉద్దేశంతో వారం రోజులు గ్యాప్‌తో తమ చిత్రాన్ని విడుదల చేస్తే బాగుంటుందని చిత్రబృందం ఆలోచనలో పడిపోయిందని టాక్ వినిపిస్తోంది. మరి.. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

More from my site