ఖైదీలో కనిపించనున్న మెగా హీరోలు ఎవరు? ఎంతసేపు? ఫుల్ డిటెయిల్స్

khaidi no 150 movie highlites

చిరంజీవి 150వ సినిమా ఇదీ అని కన్ఫాం అవకముందు నుంచీ కూడా మెగా అభిమానుల్లో ఓ ప్రశ్న సర్క్యులేట్ అయింది. చిరంజీవి కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోనున్న ఈ సినిమాలో మెగా హీరోలంతా కనిపిస్తారా? పవర్ స్టార్ కూడా కనిపిస్తాడా? ఎవరెవరు ఎంతసేపు కనిపిస్తారు లాంటి ప్రశ్నలు వినిపించాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కనిపించబోవడం లేదు అని మెగా సన్నిహితులు చెప్పారు. సాయి ధరమ్ తేజ్‌కి కూడా ఛాన్స్ లేదు. వరుణ్ తేజ్‌పైన మాత్రం షూటింగ్ జరిగిందని తెలుస్తోంది. ఆ సీన్ సినిమాలో ఉంటుందో ఉండదో తెలియదు. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో ఖైదీ నుంచి చాలా చాలా సీన్స్ లేచిపోతున్నాయి. స్టార్ కమెడియన్ పృథ్వీ నటించిన సీన్స్ కూడా తీసేశారని తెలుస్తుంది.

వీళ్ళందరి విషయం పక్కన పెడితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఓ సాంగ్‌లో దర్శనమివ్వనున్నాడు. అది కూడా 30 సెకన్ల పాటు తండ్రితో కలిసి మెరుస్తాడని తెలుస్తోంది. రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాలో చిరంజీవి నటించిన సీన్స్ విషయం పక్కన పెడితే ఒక చిన్న డ్యాన్స్ బిట్ మాత్రం కొన్ని సెకన్ల పాటు ఉంటుంది. ఇప్పుడు ఈ ఖైదీలో కూడా అలాంటి బిట్ ఒకటి ఉంటుందని తెలుస్తోంది. అది కూడా తండ్రీ కొడుకులిద్దరూ కలిసి వీణ స్టెప్ వేస్తారట. సో……మెగా అభిమానులందరూ థియేటర్స్ దద్దరిల్లేలా విజిల్స్ కొట్టడానికి, సంక్రాంతి పండగను థియేటర్స్‌లోనే చేసుకోవడానికి ఈ థర్టీ సెకన్లు సరిపోయే రేంజ్‌లో ఆ సీన్ ఉంటుందన్నమాట.

More from my site