Moviesఓవర్సీస్‌లో ఖైదీ, శాతకర్ణిల అసలు లెక్కలివే!

ఓవర్సీస్‌లో ఖైదీ, శాతకర్ణిల అసలు లెక్కలివే!

Khaidi No 150 and Gautamiputra Satakarni overseas collections reports are out. According to reports, Satakarni already entered in safe zone and khaidi have to collect minor amount to enter in safe zone.

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి, బాలయ్యల ప్రతిష్టాత్మక 150, 100 సినిమాలు బాక్సాఫీస్‌ని ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. అంచనాలకు మించే భారీ వసూళ్లు రాబడుతున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ ఈ రెండు మూవీలు దిమ్మతిరిగే వసూళ్లు రాబడుతున్నాయి. యూఎస్‌లో అయితే ఈ మూవీలు ట్రేడ్ వర్గాల నిపుణులకే మైండ్ బ్లాంక్ అయ్యేలా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. ఓసారి ఆ లెక్కలు చూస్తే..

కేవలం ప్రీమియర్స్ ద్వారానే 1.29 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన ఖైదీ సినిమా.. ఆ తర్వాత ఐదు రోజుల లాంగ్ వీకెండ్‌లో డీసెండ్ కలెక్షన్స్ రాబట్టింది. ఆ లెక్కలన్నీ కలుపుకుంటే.. 2.1 మిలియన్ డాలర్స్‌గా లెక్క తేలింది. అంటే.. దాదాపు ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కి చేరిపోయింది. నిజానికి.. ఈ మూవీ రైట్స్‌ని ఓవర్సీస్‌లో రూ.12 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇందులో 2 కోట్ల రిఫండబుల్ అమౌంట్ కూడా ఉంటుంది. అంటే.. ఏ మొత్తానికైతే ఈ మూవీని కొన్నారో, అంత రాబట్టలేకపోతే 2 కోట్లు రిఫండ్ చేయాల్సి ఉంటుందన్న మాట. ఇక రెస్టాఫ్ ది వరల్డ్ హక్కుల్ని డిస్ట్రిబ్యూటర్ 2.5 కోట్లకు విక్రయించాడు. ఈ లెక్కన.. కేవలం యూఎస్ నుంచే 9.5 కోట్లు రికవర్ చేయాల్సి ఉంటుంది.

ఇప్పటివరకైతే ఖైదీ యూఎస్‌లో రూ.14.32 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో రూ.7.9 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ఉంటుంది. అంటే.. ‘ఖైదీ’ బ్రేక్ ఈవెన్‌కి చేరాలంటే ఇంకా 1.6 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుందున్నమాట. ప్రస్తుతం ఈ మూవీ దూకుడు చూస్తే.. ఆ అమౌంట్‌ని ఈజీగా కొల్లగొడుతుందని, 3 మిలియన్ డాలర్లు అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ ఆ అమౌంట్ కలెక్ట్ చేయకపోతే.. అగ్రిమెంట్ ప్రకారం నిర్మాత నుంచి డిస్ట్రిబ్యూటర్ రిఫండ్ అందుకుంటాడు. ఈ లెక్కన.. అతను ఆల్రేడీ సేఫ్ జోన్‌లో ఉన్నట్లే అన్నమాట.

ఇక శాతకర్ణి విషయానికొస్తే.. ఈ మూవీ ఓవర్సీస్ హక్కులన్ని 5 కోట్లను తీసుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం రూ.8.32 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇందులో 4.6 కోట్ల షేర్ కాగా.. రెస్టాఫ్ ది వరల్డ్ రైట్స్ అమ్మడం ద్వారా 90 లక్షలు డిస్ట్రిబ్యూటర్‌కి వచ్చాయి. అంటే.. డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ 50 లక్షల లాభం గడించాడన్న మాట. ఇకపై అతనికి వచ్చేదంతా లాభాలే. ఇప్పటికీ ఈ చిత్రానికి ఓవర్సీస్‌లో మంచి ఆదరణ లభిస్తోంది కాబట్టి.. ఇది సునాయాసంగా 1.5 కోట్ల క్లబ్‌లో చేరిపోతుంది. కుదిరితే.. 2 మిలియన్ మార్క్‌ని కూడా క్రాస్ చేయవచ్చునని అంచనా వేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news