Movies‘ఖైదీ నెంబర్ 150’ ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ‘బాహుబలి’ ఆల్‌టైం...

‘ఖైదీ నెంబర్ 150’ ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ‘బాహుబలి’ ఆల్‌టైం రికార్డ్ బ్రేక్

Megastar Chiranjeevi’s 150th movie ‘Khaidi Number 150’ has collected mindblowing shares at the worldwide boxoffice in it’s first day run. It has broken Baahubali alltime record in Telugu states and Karnakata.

తొమ్మిదేళ్ల తర్వాత వెండితెరకు రీఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. గత రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలే కాదు, సినీ జనాలు కూడా భావించారు. అనుకున్నట్లుగానే జరిగింది. ఇన్నేళ్ల గ్యాప్ వచ్చినా.. తన స్టామినా ఇంకా ఏమాత్రం తగ్గలేదని చిరు నిరూపించుకున్నారు. తన 150వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’తో బాక్సాఫీస్‌ని షేక్ చేసేశారు. దర్శకధీరుడు రాజమౌళి విజువల్ వండర్ ‘బాహుబలి’ని సైతం వెనక్కు నెట్టేసి.. నెం.1 పొజిషన్‌లోకి వచ్చేశారు.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.37.28 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. అందులో.. తెలుగు రాష్ట్రాల నుంచే ఈ చిత్రం రూ.25.05 కోట్లు కొల్లగొట్టడం విశేషం. దీంతో.. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఉన్న ‘బాహుబలి’ ఆల్‌టైం రికార్డ్ బద్దలైపోయింది. చాలాకాలం తర్వాత చిరు రీఎంట్రీ ఇవ్వడం, అది కూడా ఆయన మైల్‌స్టోన్ మూవీ కావడంతో.. ఆడియెన్స్ దీనికి బ్రహ్మరథం పట్టారు. అందుకే.. ఈ రేంజ్ కలెక్షన్లతో రాబట్టి, ఏపీ-తెలంగాణ కలుపుకుని హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టిన చిత్రంగా మొదటి స్థానంలో నిలిచింది. వరల్డ్‌వైడ్ పరంగా మాత్రం ‘బాహుబలి’నే (రూ.43 కోట్లు షేర్) ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. కర్ణాటకలోనూ ఈ చిత్రం ఆల్‌టైం రికార్డ్ క్రియేట్ చేసింది. తొలిరోజు రూ.4.11 కోట్లు రాబట్టి, ఆ రాష్ట్రంలో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. యూఎస్‌లోనూ ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది. కేవలం ప్రీమియర్ల ద్వారానే $ 1,251,548 (రూ. 8.56 కోట్లు) సంపాదించింది. కొద్దిలో ‘బాహుబలి’ ($1.36M) రికార్డ్‌ని మిస్ అయినా.. ఆ మూవీ తర్వాత యూఎస్‌లో అత్యధిక కలెక్షన్స్ కలెక్ట్ చేసిన సౌత్ ఇండియన్ సినిమాగా ‘నాన్-బాహుబలి’రికార్డ్‌ని కైవసం చేసుకుంది.

ఏరియాలవారీగా ఫస్ట్ డే కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 6.47
సీడెడ్ : 4.00
వైజాగ్ : 2.70
ఈస్ట్ గోదావరి : 3.50
వెస్ట్ గోదావరి : 3.00
కృష్ణా : 1.59
గుంటూరు : 2.79
నెల్లూరు : 1.00
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 25.05 కోట్లు (షేర్)
కర్ణాటక : 4.11
రెస్టాఫ్ ఇండయా : 0.62
ఓవర్సీస్ : 7.50
టోటల్ వరల్డ్‌వైడ్ : రూ. 37.28 కోట్లు (షేర్)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news