Movies ఖైదీ యాక్షన్ సీన్ మేకింగ్ వీడియో.. బాస్ ఈజ్ రియల్లీ...

ఖైదీ యాక్షన్ సీన్ మేకింగ్ వీడియో.. బాస్ ఈజ్ రియల్లీ రియల్లీ బ్యాక్

Konidela Productions Company has released another making video of Khaidi No 150 movie in which Megastar Chiranjeevi shows his stamina with strong energy after 10 years of long gap also.

దాదాపు దశాబ్దం గ్యాప్ తర్వాత తిరిగి రీఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. తన పూర్వవైభవాన్నే ప్రదర్శిస్తాడా? అప్పట్లాగే నటనలో తన స్టామినా చూపించగలరా? అనే అనుమానాలు మొదట్లో వెల్లువెత్తాయి. పైగా.. వయస్సు కూడా మీదపడుతోంది కాబట్టి, ‘మెగాస్టార్’ అనే ట్యాగ్‌కి ఆయన న్యాయం చేయగలడా? అనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. అయితే.. వాటన్నింటినీ తెరదించుతూ తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు చిరు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా తన స్టైల్, తన టాలెంట్ ఒక్కటేనని చేసి చూపించాడు.

మొన్నటికిమొన్న లీకైన ఓ వీడియోలో అదిరిపోయే డ్యాన్స్ వేసి.. ఔరా అనిపించాడు చిరు. ఈ వయసులోనూ ఏమాత్రం తడబడకుండా సుతిమెత్తంగా ఆయన వేస్తున్న స్టెప్పులు చూసి శెభాష్ అన్నారు. ఇప్పుడు తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోలో ఆయన చేసిన యాక్షన్ చూస్తే.. ప్రతిఒక్కరూ పూనకంతో ఊగిపోవాల్సిందే. అదే స్టైల్, స్టామినా, ఇంటెన్సిటీతో తన సత్తా చాటాడు. ఎక్కడా తన స్టైల్ మిస్ కాకుండా ఆయన చేసిన యాక్షన్.. రొమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. నమ్మశక్యంగా లేదా.. అయితే.. క్రింది వీడియోని చూడండి.. నోళ్లు వెళ్ళబెట్టుకుంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news