Moviesఅఫీషియల్ : ఏరియాలవారీగా ‘ఖైదీ నెం.150’ 7 రోజుల వరల్డ్‌వైడ్ గ్రాస్...

అఫీషియల్ : ఏరియాలవారీగా ‘ఖైదీ నెం.150’ 7 రోజుల వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్స్ వివరాలు

Khaidi No 150 movie unit has announced official first week worldwide collections details in a press meet.

సాధారణంగా నిర్మాతలు తమ సినిమా కలెక్షన్ల వివరాల్ని వెల్లడించరు. ఇన్‌కమ్ ట్యాక్స్ పరమైన ఇబ్బందులు తలెత్తుతాయన్న భయంతో కలెక్షన్ల వ్యవహారంపై జంకుతారు. కానీ.. ‘ఖైదీ నెం.150’ యూనిట్ మాత్రం అందరిలా వెనకడుగు వేయకుండా ఆ డీటైల్స్‌ని ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పింది. వినాయక్‌తో చేసిన ప్రెస్‌మీట్‌లో భాగంగా.. అల్లు అరవింద్ ఈ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్లు అఫీషియల్‌గా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తమ సినిమా రూ. 108.48 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని పేర్కొన్న ఆయన.. ఏరియాల వారీగా ఎంత కలెక్ట్ చేసిందో కూడా రివీల్ చేశారు. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో)..

ఏపీ+తెలంగాణ : 76.15
కర్ణాటక : 9
నార్త్ ఇండియా : 1.43
నార్త్ అమెరికా : 17
ఒరిస్సా : 0.40
తమిళనాడు : 0.60
రెస్టాఫ్ వరల్డ్ : 3.9
టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ : రూ. 108.48 కోట్లు
ఇక షేర్ అమౌంట్ చూసుకుంటే.. రూ.78.65 కోట్లు అని లెక్క తేలింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news