థ్యాంక్స్ మీట్ లో అల్లు అరవింద్ కు దిమ్మ దిరిగే పంచ్ వేసిన మహానటి..! (వీడియో)

keerthy-suresh-puches-to-al

సావిత్రి బయోపిక్ లో టైటిల్ రోల్ పోశించిన కీర్తి సురేష్ తంకు పడిన కష్టానికి తగిన ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. ఆల్రెడీ పక్కింటి అమ్మాయిగా చేసిన సినిమాల్లో అందరి అభిమానాన్ని సంపాదించుకున్న కీర్తి సురేష్ మహానటిగా ఎక్కడికో వెళ్లిపోయింది. సావిత్రమ్మ ఆశీస్సులతోనే ఇది సాధ్యమైంది అన్న మాటని నిజం చేస్తూ నేటితరం అభినయతారగా కీర్తి అదరగొట్టింది.

ఇక మహానటి సక్సెస్ ను పురస్కరించుకుని అల్లు అరవింద్ ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ లో కీర్తి సురేష్ అల్లు అరవింద్ మీద పంచ్ వేసింది. కీర్తి సురేష్ తల్లిదండ్రులు మేనక, సురేష్ కుమార్ లు అల్లు అరవింద్ కు తెలిసిన వారే. మేనక ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించారు కూడా. అయితే కీర్తి సురేష్ ఎప్పుడు కలిసినా కూడా ప్రతి సారి తనని తాను అరవింద్ కు పరిచయం చేసుకుంటూ నా పేరు కీర్తి సురేష్ తన తల్లితండ్రులు మేనకా సురేష్ అని చెప్పుకునేదట.

అప్పుడు ఆయన తనని గుర్తించే వారని ఇక నుండి తనని అల్లు అరవింద్ గారు డైరెక్ట్ గా గుర్తిస్తారని చెప్పుకొచ్చింది. కీర్తి సురేష్ ఈ మాటలను బట్టి చూస్తే అల్లు అరవింద్ కు పంచ్ వేసిందనే అంటున్నారు. ఇక సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నిషియన్ గురించి మాట్లాడి నాగ్ అశ్విన్ లేనిదే మహానటి లేదని ఈ క్రెడిట్ అంతా తనదే అని చెప్పుకొచ్చింది నేటి మహానటి కీర్తి సురేష్.

Leave a comment