Moviesకాటమరాయుడి ‘ఈగో’ని తట్టుకోలేక పత్తాలేకుండా పోయిన ఖైదీ

కాటమరాయుడి ‘ఈగో’ని తట్టుకోలేక పత్తాలేకుండా పోయిన ఖైదీ

Pawan Kalyan’s latest movie Katamarayudu East Godavari rights have been sold for bomb price which is said to be alltime record.

పదేళ్ల తర్వాత తన ప్రతిష్టాత్మక 150వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఎన్ని సంచలనాలు నమోదు చేశాడో అందరికీ తెలుసు. అటు ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగానూ, ఇటు కలెక్షన్ల పరంగానూ సరికొత్త రికార్డులు సృష్టించి.. తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ఆయన నిరూపించుకున్నాడు. అయితే.. అన్నకు తగ్గ తమ్ముడిగా పవన్ కళ్యాణ్ కూడా దూసుకుపోతున్నాడు. తన తాజా చిత్రం ‘కాటమరాయుడు’ ద్వారా తన అన్నయ్య క్రియేట్ చేసిన రికార్డుల్ని ఒక్కొక్కటిగా బద్దలుకొట్టుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే సీడెడ్‌లో అత్యధిక రూ.12.06 కోట్ల మేర బిజినెస్ చేసి ‘ఖైదీ’ (రూ. 11.07) రికార్డ్‌ని బ్రేక్ చేసిన పవన్ మూవీ.. తాజాగా ఈస్ట్ గోదావరిలోనూ మరో ఘనత సాధించింది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘కాటమరాయుడు’ ఈస్ట్ గోదావరి హక్కుల్ని ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అక్షరాల రూ. 5.86 కోట్లకు సొంతం చేసుకున్నాడు. ఆ ఏరియాలో హయ్యెస్ట్ ధర ఇదే. ఇంతకుముందు ‘ఖైదీ’ రూ. 5.60 కోట్ల మేర బిజినెస్ చేసి ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ ద్వారా పవన్ దాన్ని బీట్ చేసి, ఆల్‌టైం రికార్డ్ నమోదు చేశాడు. అయితే.. కొన్ని ఏరియాల్లో మాత్రం ఖైదీని బీట్ చేయలేకపోయింది కానీ, దానికి దాదాపు సమానంగా బిజినెస్ చేసింది. గుంటూరులో ఖైదీ రైట్స్ రూ.6.40 కోట్లకు అమ్ముడుపోతే.. కాటమరాయుడు రైట్స్ రూ.6 కోట్లకే కొనుగోలు చేయబడ్డాయి. అలాగే.. వెస్ట్ గోదావరిలో ఖైదీ రూ. 4.75 కోట్ల ధర పలకగా.. పవన్ మూవీ రూ. 4.60 కోట్లు పలికింది. మొత్తానికి.. మెగాబ్రదర్స్ ఇద్దరూ ఈ ఇండస్ట్రీని శాసిస్తున్నారని ఈ లెక్కలే నిరూపించాయి.

కాగా.. మిగిలిన ఏరియాల్లోనూ ‘కాటమరాయుడు’కి భారీ డిమాండ్ ఉందని, దీని రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడుతున్నారని తెలిసింది. శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు డాలీ తెరకెక్కిస్తున్నాడు. ఈమూవీ మార్చి 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news