Gossipsకళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే రిలీజ్ డేట్ వచ్చేసింది !!

కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే రిలీజ్ డేట్ వచ్చేసింది !!

రాం చరణ్ రంగస్థలం సినిమాకు పోటీగా నందమూరి హీరో కళ్యాణ్ రాం ఎం.ఎల్.ఏ సినిమా రిలీజ్ చేయాలని చూశారు. ఉపేంద్ర మాధవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ముందు చరణ్ కు పోటీగా వద్దామనుకున్న కళ్యాణ్ రాం ఎందుకో మళ్లీ వెనక్కి తగ్గాడు. సినిమా అనుకున్నట్టుగా 28, 29 నుండి మార్చి 22కి ప్రీ పోన్ అవుతుందని తెలుస్తుంది.

కళ్యాణ్ రాం తో కాజల్ జంటగా నటించిన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇంప్రెస్ చేస్తున్నాయి. మరోపక్క నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ మూవీ కిరిక్ పార్టీ రీమేక్ కిరాక్ పార్టీ కూడా మార్చి ఎండింగ్ లో రాబోతుంది. మొత్తానికి మార్చి ఎండింగ్ క్రేజీ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news