Reviewsకళ్యాణ్ రామ్ "MLA" సినిమా రివ్యూ & రేటింగ్

కళ్యాణ్ రామ్ “MLA” సినిమా రివ్యూ & రేటింగ్

పటాస్ లాంటి పవర్ ఫుల్ హిట్ కొట్టాక కళ్యాణ్ రాం మళ్లీ ఎందుకో వెనక్కి తగ్గాడు. సినిమాలైతే చేస్తున్నాడు కాని తగినంత ప్రేక్షకుల ఆమోదాన్ని సంపాదించలేకపోతున్నాడు. అందుకే ఉపేంద్ర మాధవ్ డైరక్షన్ లో ఎం.ఎల్.ఏ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించాడు. ఈరోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్ష లో చూసేద్దాం.

కథ :

సరదాగా జీవితం గడుపుతున్న హీరో కళ్యాణ్ రాం తన సోదరి వివాహానంతరం బావ వెన్నెల కిశోర్ తో బెంగళూరు వెళ్తారు. అక్కడ ఇందు (కాజల్)ను చూసి మొదటి చూపులోనే ఇష్టపడతాడు. ఇందు ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న హీరో ఆమెను కాపాడాలని విలన్ రవికిషన్ కు పోటీగా ఎం.ఎల్.ఏ గా నామినేషన్ వేస్తాడు. అంతేకాదు ఊళ్లో మంచి పనులన్ని చేస్తాడు. ఇంతకీ చివరకు హీరో ఎం.ఎల్.ఏ అయ్యాడా..? ఇందు ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది. ఇందు హీరో ప్రేమను ఒప్పుకుందా అన్నది సినిమా కథ.

DXgacBNXUAAnyf2

నటీనటుల ప్రతిభ :

కళ్యాణ్ రాం ఈ సినిమా మొత్తం తన భుజాన వేసుకుని నడిపించాడు. కామెడీ కొత్తగా ట్రై చేశాడు. కాజల్ ఎప్పటిలానే తన గ్లామర్ ఎటాక్ తో ఆకట్టుకుంది. సాంగ్స్ లో అమ్మడి సోయగాలు అలరించాయి. ఇక రవి కిషన్ ఎప్పటిలానే ఇంప్రెస్ చేశాడు. బ్రహ్మానందం చాలా గ్యాప్ తర్వాత లాయర్ పట్టాబిగా అలరించాడు. వెన్నెల కిశోర్, థర్టీ ఇయర్స్ పృధ్వి అందరు సినిమాను ఎంటర్టైన్ మోడ్ లో నడిచేందుకు సహకరించారు.

సాంకేతికవర్గం పనితీరు :

ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ బాగుంది. కళ్యాణ్ రాం లుక్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. సినిమాలో డైలాగ్స్ ఎక్కువ ఇంపాక్ట్ కలిగించేలా రాసుకున్నారు. మణిశర్మ మ్యూజిక్ సోసోగానే ఉంది. రెండు సాంగ్స్ మినహా అంతగా ఇంప్రెస్ చేయలేదు. ఉపేంద్ర మాధవ్ ఓ పవర్ ప్యాక్డ్ ఫన్ ఎంటర్టైనర్ సినిమాతో వచ్చాడు. మొదటి సినిమానే అయినా దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. అయితే కథ చాలా వీక్ గా రొటీన్ గా అనిపించక మానదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

DYPVu3_VwAEMXd9

విశ్లేషణ :

ఎం.ఎల్.ఏ అంటూ వచ్చిన కళ్యాణ్ రాం రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చాడు. సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నా సరే సినిమా మాత్రం ఎక్కడ బోర్ కొట్టకుండా అన్ని సమపాళ్లలో ఉండేలా జాగ్రత్త పడ్డారు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్ కు ఈక్వల్ గా సెకండ్ హాఫ్ లో కూడా ఫన్ ఉంటుంది. హీరో విలన్ చాలెంజింగ్ బాగుంటుంది.

ముఖ్యంగా సినిమాలో కళ్యాణ్ రాం డైలాగ్స్ కేక పెట్టించేస్తాయి. నందమూరి ఫ్యాన్స్ కు ఈ డైలాగ్స్ బాగా ఎక్కేస్తాయి. సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ మోడ్ లో నడిపించేందుకు దర్శకుడు కష్టపడ్డాడు. అందుకు తగినట్టుగానే కథనం రాసుకున్నాడు. అయితే రొటీన్ కథ లానే అనిపించడం.. ఊహించే సన్నివేశాలు ఉండటం వల్ల కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఇది నచ్చే అవకాశం ఉండదు.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ ఎం.ఎల్.ఏ. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా అనిపించింది. దర్శకుడు కథను హ్యాండిల్ చేసిన విధానం బాగుంది.

Nandamuri-Kalyanram-and-Kajal-Aggarwal-New-Stills-From-MLA-

ప్లస్ పాయింట్స్ :

కామెడీ సీన్స్

డైలాగ్స్

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ కథ

మ్యూజిక్

బాటం లైన్ :

కళ్యాణ్ ఎం.ఎల్.ఏ.. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్..!

రేటింగ్ : 3.0/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news