Gossipsమల్టీస్టారర్ కి సర్వం సిద్ధం... ఇక రికార్డుల మోతే..!

మల్టీస్టారర్ కి సర్వం సిద్ధం… ఇక రికార్డుల మోతే..!

నందమూరి అభిమానులంతా ఎదురుచూస్తే నందమూరి మల్టీస్టారర్ కు రంగం సిద్ధం అవుతుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. నందమూరి హరికృష్ణ, కళ్యాణ్ రాం లతో పాటుగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ మల్టీస్టారర్ లో నటిస్తారని తెలుస్తుంది. ఈ ముగ్గురు మాత్రమేనా బాలయ్య కూడా ఈ సినిమాలో నటిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

అయితే ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను కళ్యాణ్ రాం తీసుకున్నారట. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు చెప్పిన కథలను చర్చిస్తున్నారట. తప్పకుండా త్వరలోనే నందమూరి మల్టీస్టారర్ సినిమాపై కచ్చితమైన క్లారిటీ వస్తుందని తెలుస్తుంది. మరి అదే కనుక జరిగితే రికార్డుల మోతతో బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయమని చెప్పొచ్చు.

ప్రస్తుతం ఎన్.టి.ఆర్ త్రివిక్రం సినిమాతో బిజీ అవనున్నాడు. అది పూర్తయ్యాక రాజమౌళితో సినిమా ఉంది. అయితే పేరుకి మల్టీస్టారర్ అయినా ఎన్.టి.ఆర్ పాత్ర అందులో నిడివి తక్కువ ఉండే అవకాశం ఉందట. మరి ఈ సినిమా గురించి మిగతా డీటేల్స్ త్వరలో తెలుస్తాయి.

https://youtu.be/w3eSDytLUjo

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news