Gossipsమెగాస్టార్ కనుసన్నల్లోనే కళ్యాణ్

మెగాస్టార్ కనుసన్నల్లోనే కళ్యాణ్

మెగా అల్లుడు సినీ రంగ ప్రవేశానికి మెగా స్టార్ తెగ హైరానా పడిపోతున్నట్టు కనిపిస్తున్నాడు. ఎలాగైనా తన చిన్న అల్లుడిని సినిమాల్లో మెగా హీరోగా చెయ్యాలని చిరు బాగానే కష్టపడిపోతున్నాడు. అందుకే కథ ఎంపిక దగ్గర నుంచి హీరోయిన్ సెలక్షన్ వరకు అన్నీ మెగాస్టార్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. కళ్యాణ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఇండ్రస్ట్రీలో పాతుకుపోవాలని చూస్తున్నాడు.

సినిమాలపై మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని కళ్యాణ్ ఆ తరువాత మెగా ఫ్యామిలీని చూసి ఆశపడ్డాడో ఏమో కానీ తనకు నటనపై ఉన్న ఇష్టాన్ని చిరు దగ్గర వ్యక్తం చేసాడు. వెంటనే చిరు అనేక సూచనలు ఇచ్చి మరీ
సత్యానంద్ దగ్గర నటన పై శిక్షణను ఇప్పించాడు. దాంతో పాటు డాన్స్ వంటి వాటిపై శిక్షణ కూడా ఇప్పించాడు. మొదట్లో బిజినెస్ వ్యవహారాలతో బిజీ అయిన కళ్యాణ్ ఆ తరువాత హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

అనుకున్నట్టే కళ్యాణ్ హీరోగా రాకేష్ శశి అనే కొత్త దర్శకుడు ఓ మంచి కథ చెప్పడం, ఈ సినిమాకి ఎన్నో హిట్ సినిమాలు అందించిన సాయి కొర్రపాటి నిర్మాతగా ఉండడంతో వెంటనే చిరు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అంతే కాదు ఈ సినిమా కు సంబంధించి దర్శక నిర్మాతలకు చిరు ఎన్నో జాగ్రత్తలు చెప్పాడట. భారీ బడ్జెట్ లేకుండా ఓ కొత్త హీరో సినిమా ఎలా ప్లాన్ చేస్తారో అలానే ప్లాన్ చెయ్యమని వారికీ సూచించాడట.
మెగా అల్లుడు కదా చిరు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోడా ఏంటి ..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news