Gossipsకాజల్ మనసులో ఇంత విచిత్రమైన కోరిక ఉందంటే మీరసలు నమ్మలేరు..!

కాజల్ మనసులో ఇంత విచిత్రమైన కోరిక ఉందంటే మీరసలు నమ్మలేరు..!

టాలీవుడ్ చందమామ కాజల్ తన కెరియర్ ముగిసింది అనుకునే లోపే మళ్లీ అవకాశాలతో అదరగొడుతుంది. ఖైది నంబర్ 150 చేసేందుకు కాస్త ఆలోచించిన అమ్మడు ఆ సినిమా తర్వాతనే తన క్రేజ్ మళ్లీ రెట్టింపు చేసుకుంది. ఇక ఈమధ్యనే వచ్చిన నాని నిర్మించిన అ! సినిమా కూడా కాజల్ కెరియర్ కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.

కమర్షియల్ ఎంటర్టైనర్ అన్నిటిలో చేసిన అమ్మడు మగధీరలో మిత్రవిందలా అలరించింది. ఇక ఈ సినిమాలు చేసి బోర్ కొట్టింది అనుకుంటా ఓ ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీలో స్టంట్స్ తో కూడా సినిమా చేయాలని అంటుంది కాజల్. రెగ్యులర్ సినిమాలు చేసి బోర్ కొట్టిన కాజల్ ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ లపై మొగ్గు చూపుతుంది. యాక్షన్ స్టార్ గా తనని తాను చూసేందుకు ఇష్టపడుతున్న అమ్మడు మంచి కథ దొరికితే అలాంటి సినిమా చేయాలని ఉందని అంటుంది.

పైకి సున్నితంగా కనిపించే కాజల్ కోరిక మరి ఇంత వైలెంట్ గా ఉంటుందని ఎవరు ఊహించరు. మరి అమ్మడు చెప్పిన వైలెంట్ స్టోరీతో ఏ డైరక్టర్ ఆమెను కలుస్తారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news