Specialsఎన్టీఆర్ ను కొట్టేసిన రానా.. బిగ్ బాస్ కన్నా నెంబర్ 1...

ఎన్టీఆర్ ను కొట్టేసిన రానా.. బిగ్ బాస్ కన్నా నెంబర్ 1 యారి రేటింగ్ అదుర్స్..!

టాలీవుడ్ ఇద్దరు టాప్ స్టార్స్ ఒకేసారి టెలివిజన్ షోస్ చేయడం మొదలు పెట్టారు. బిగ్ బాస్ రియాలిటీ షోతో తారక్ స్టార్ మాలో వస్తుండగా.. జెమిని టివిలో రానా నెంబర్ 1 యారి అంటూ తన యాంకరింగ్ తో అదరగొడుతున్నాడు. టాప్ స్టార్స్ ఇద్దరు టివి షోలతో కూడా ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ వారం టి.ఆర్.పి రేటింగులలో రానా ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ షోని క్రాస్ చేసిందట.

ఈ వారం 10.3 టి.ఆర్.పి రేటింగ్ తో రానా ముందంజలో ఉన్నాడట. అయితే తారక్ బిగ్ బాస్ కు మాత్రం కేవలం 6.23 రేటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. 9 వారాల పాటు వస్తున్న రానా నెంబర్ 1 యారి షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మంచు లక్ష్మి, తాప్సీ వచ్చిన నెంబర్ 1 యారి బిగ్ బాస్ షోని బీట్ చేసింది.

పోటాపోటీగా సాగుతున్న ఈ షో ఇద్దరు స్టార్స్ అభిమానుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ఏర్పడేలా చేస్తుంది. మరి బిగ్ బాస్ ఈ వారం టాప్ ప్లేస్ లో లేకున్నా వచ్చే వారాల్లో మాత్రం తప్పకుండా మళ్లీ తారక్ తన అభినయంతో రేటింగ్ లో టాప్ రేంజ్ కు తీసుకెళ్తాడని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news