Moviesజై లవకుశలో కాపీ ట్యూన్లు... ఆ సినిమా లోనివే

జై లవకుశలో కాపీ ట్యూన్లు… ఆ సినిమా లోనివే

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ మూడు వ‌రుస సూప‌ర్ హిట్ సినిమాల‌తో దూసుకుపోతున్నాడు.   ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ ఆడియో రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఈ ఆడియోకు అన్న‌కున్న రేంజ్‌లో రెస్పాన్స్ రావ‌డం లేదు. ఎన్టీఆర్ గ‌త కొన్నేళ్ల‌లో చేస్తోన్న సినిమాల ఆడియోతో పోల్చుకుంటే ఇది వీక్ ఆల్బ‌మ్ అని ఎన్టీఆర్ అభిమానేలే దేవిశ్రీపై ఫైర్ అవుతున్నారు.

సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. భారీ ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇక ఆల్బ‌మ్‌లో ఉన్న నాలుగు పాట‌ల్లో రావ‌ణ పాట‌కు మిన‌హా మిగిలిన దేవిశ్రీ అందించిన ట్యూన్స్ క్యాచీగా లేవ‌న్న టాక్ న‌డుస్తోంది. ఇక దేవి గ‌తంలో అందించిన ట్యూన్స్‌ను జై ల‌వ‌కుశ ట్యూన్స్ పోలి ఉన్నాయ‌న్న నెగిటివ్ టాక్ కూడా వ‌చ్చేసింది.

‘నీ కళ్ళలోన’ పాట ట్యూన్,  ఎత్తుగడ బాగున్నా పాట మధ్యలోకి వచ్చేసరికి ఆ పాటకు దేవిశ్రీ అందించిన ట్యూన్ తేలిపోయింది. ‘ట్రింగ్ ట్రింగ్’ ‘దోచేస్తా’ పాటల ట్యూన్స్ కూడ పెద్దగా క్యాచీగా లేవు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇక దోచేస్తా పాట అయితే చిరంజీవి న‌టించిన శంక‌ర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో సాంగ్ ట్యూన్‌ను కాపీ చేసేసిన‌ట్టే ఉంది.

ఇది గ‌మ‌నించిన నెటిజ‌న్లు పాత ట్యూన్‌, కొత్త ట్యూన్‌ను కలిపి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఏదేమైనా దేవి మ‌రోసారి త‌న‌కు ఉన్న కాపీ క్యాట్ బిరుద‌ను నిరూపించుకున్నాడ‌న్న సెటైర్లు మ‌నోడిపై ప‌డిపోతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news