Gossipsమెగా అభిమానులకి పండగే అని చెప్పుకోవాలి

మెగా అభిమానులకి పండగే అని చెప్పుకోవాలి

 

ఇంటికి ఒక్క‌డు కావాలె జంగ్ కి సై అని దూకాలె ఇలా ప్రారంభం అయ్యే పాట ఎందులోనిది అనుకుంటున్నారా.. సాయి ధ‌ర‌మ్ హీరోగా న‌టిస్తోన్న జ‌వాన్ లోనిది. నిన్న‌టి బ‌ర్త్ డే జ‌రుపుకున్న మెగా అల్లుడు ట్విట‌ర్ ద్వారా ఈ పాట‌ని విడుద‌ల చేసి అభిమానుల‌ను అల‌రించాడు. త‌మ‌న్ అందించిన సంగీతం, కేకే సాహిత్యం బాగా కుదిరాయి అని టీ టౌన్ వ‌ర్గాలు చెబుతున్న మాట‌. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. దీంతో సినిమాపై అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. రైట‌ర్ బీవీఎస్ ర‌వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో కృష్ణ నిర్మిస్తున్నారు.తమన్ రీ రికార్డింగ్, కెవి గుహన్ సినిమాటోగ్రఫి ఈ చిత్రానికి హైలైట్ కానున్నాయని నిర్మాత చెబుతున్నారు.

జ‌వాన్ … ఇంటికొక్క‌డు

దేశానికి జవాన్ ఎంత అవసరమో… ప్రతీ ఇంటికి మా కథానాయకుడి లాంటి వాడు ఒక‌డు ఉండాలని చెప్పడమే మా ఉద్దేశ‌మని దర్శకుడు బీవీఎస్ రవి తెలిపారు.మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో సాయి ధరమ్ కనిపిస్తున్నాడు.స‌మ‌స్య‌ల్లో చిక్కున్న తన కుటుంబాన్ని మ‌నోధైర్యంతో, బుద్ధిబ‌లంతో ఎలా కాపాడుకున్నాడన్నదే ఈ సినిమా కథ. మెహ్రీన్ నాయ‌కిగా న‌టిస్తోన్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తిచేసుకుని త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news