Moviesజనతా గ్యారేజ్ హైప్ చూస్తే మతి పోతోంది!!

జనతా గ్యారేజ్ హైప్ చూస్తే మతి పోతోంది!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన భారీ చిత్రం “జనతా గ్యారేజ్”
తాజాగా సెన్సార్ పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమాంత – నిత్యా మీనన్ లు కథానాయికలుగా నటిస్తుండగా.. ప్రఖ్యాత మళయాళం నటుడు మోహన్ లాల్ ఒక ప్రధాన పాత్రను పోషించారు. సెప్టెంబర్ 1 న భారీ స్థాయిలో ఈరోస్ సంస్థనుంచి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో.. అభిమానులు కూడా భారీ హడావిడే చేస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం ఆడియో ఇప్పటికే ప్రేక్షాదారణ పొందింది. జూనియర్ స్టైలిష్ లుక్స్ – మోహన్ లాల్ స్పెషల్ ఎట్రాక్షన్ కి తోడు.. కొరటాల శివ ఫుల్ ఫాం లో ఉండటం ఈ చిత్రంపై భారీ అంచనాలకు కారణాలుగా చెప్పుకోవచ్చు. సుమారు రెండువేల థియేటర్లలో విడుదల చేయడానికి భారీ ప్లాన్స్ జరుగుతున్నాయి. ఈ సమయంలో సినిమా విడుదల సందర్భంగా పోస్టర్లకు దండలు – కటౌంట్లకు పాలాభిషేకాలు – థియేటర్లకు మేకప్ లు సర్వసాదారణమైన విషయాలుగా భావించారో ఏమో కానీ.. ఈ సినిమా విడుదల సందర్భంగా జూనియర్ అభిమానులు పచ్చబొట్లు పొడిపించుకునే వరకూ వెళ్లిపోయారు

ntr fan
ntr fan

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news