Newsతిరుపతి లో జనసేన ప్రస్థానాన్ని ప్రారంభించిన పవన్... ఫుల్ స్పీచ్

తిరుపతి లో జనసేన ప్రస్థానాన్ని ప్రారంభించిన పవన్… ఫుల్ స్పీచ్

ఇన్నాళ్లు.. ప్రశ్నించలేదు.. ప్రశ్నించలేదు.. ఇంకెప్పుడు ప్రశ్నిస్తున్నావ్.. అంటున్నారు కదా.. ఇక ప్రశ్నిస్తా చూడండి. ఇప్పుడు ప్రశ్నించే టైమొచ్చింది.. ఇన్నిరోజులు వాళ్లేం చేస్తారో చూద్దామని వెయిట్ చేశా.. కాని వాళ్లు చేస్తారన్న ఆశలు కనబడ్డంలేదు.. అందుకే ప్రశ్నించడానికి వస్తున్నా..

ఎవరిజెండా మోయ్యం :
మేమున్నది ఎవరి జెండా మొయ్యడానికి కాదు.. మా జెండా ప్రజల అజెండా.. ఎవరి జెండా మొయ్యడానికి జనసేన పుట్టలేదు. జనం కోసమే జనసేన పుట్టింది. వేరే పార్టీలలాగా మేం ఉండం.

స్పెషల్ స్టేటస్ పైనే మాట్లాడతా :
సీమాంద్రులంటే చులకనా.. వాళ్లు పౌరుషం లేనివాళ్లా.. వాళ్ల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల్లారా మాకు చేవలేదు, పౌరుషం లేదు అంటున్నారు.. మాకు దేశం పట్ల ప్రేమ ఉంది.. నిబద్ధత ఉంది అందుకే సహనంతో ఉన్నాం. కాంగ్రెస్ బీజేపీ సహా అన్ని పార్టీలు సీమాంద్రుల ప్రేమ చూశారు, సహనం చూశారు. ఇకపై మాట తప్పితే పోరాటపటిమకూడా చూస్తారు. సీమాంధ్రుల పౌరుషం చూస్తారు.ఆత్మగౌరవం దెబ్బతింటే దేశమంతా చూసేలా పోరాటాం చేస్తాం. ఇన్నాళ్లు మీరేం చేస్తారోనని వెయిట్ చేశా.. లేడికి లేచిందే పరుగులా ఉండకూడదనుకున్నా.. రెండేళ్లు గడిచాయి.. మీరు మా ఆశలు పట్టించుకోలేదు.. అందుకే ఇక నుంచి స్పెషల్ స్టేటస్ పైనే మాట్లాడతా.

అడ్డగోలు విభజన :
రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పద్దతి పాడు లేకుండా కాంగ్రెసోళ్లు విడగొట్టారు. మీ చావు మీరు చావడం అన్నట్లు చేశారు. ప్రతి పార్టీ యువత గురించి ఉపన్యాసాలు ఇస్తారు.. కానీ విడపోయిన తర్వాత సీమాంధ్ర యువతకు ఏం చేస్తారో చెప్పలేదు. స్పెషల్ స్టేటస్ రాకపోతే.. ఇక్కడి యువకులకు ఉద్యోగాలెలా వస్తాయి.

బీజేపీ తప్పు చేస్తోంది :
బీజేపీ తక్కువేం కాదు. వాళ్లు అంతే చేశారు. ఒక్కఓటు రెండు రాష్ట్రాలు అని సీమాంధ్రలో ఉన్న కాకినాడలో తీర్మానం చేశారు. అప్పట్నుంచి ఇప్పటివరకు కనీసం సీమాంధ్రకు ఏం చేయాలన్నదానిపై కసరత్తు చేయలేదు. నిర్ధాక్ష్యంగా వదిలేశారు. రాష్ట్రం విడిపోతే క్వాలిటీ ఎడ్యుకేషన్ సెంటర్లన్నీ హైద్రాబాద్ లోనే ఉన్నాయి. ఇక్కడి వాల్లు ఏం చేయాలి.

వెంకయ్యా వింటున్నావా :
రాష్ట్రం నుంచి పెద్దమనిషి వెంకయ్యనాయుడు ఉన్నారు. విభజన టైమ్ లో స్పెషల్ స్టేటస్ కోసం గొంతు చించుకున్నారు. ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బాబు పెద్దమనిషి అప్పుడెలా స్టేటస్ కోసం పోరాడావో ఇప్పుడు అంతే పోరాడు. స్టేటస్ పై ఇప్పుడు మాట్లడుతున్న మాటలను వెనక్కు తీసుకోండి. సొంతపార్టీలోకూడా స్టేటస్ కోసం పోరాడండి. అప్పుడే మీపై గౌరవం పెరుగుతుంది. ముందు తెలుగువారి గురించి ఆలోచించండి. పార్టీ ప్రయోజనాలు పక్కన పెట్టి.. జాతి ప్రయోజనా గురించి ఆలోచించండి.

జిల్లాల్లో పర్యటిస్తా :
స్పెషల్ స్టేటస్ కోసం మూడు దశలో పోరాటం చేస్తా. ముందుగా అన్ని జిల్లాలు తిరుగుతా. స్పెషల్ స్టేటస్ వస్తే లాభాలేంటో వివరిస్తా. బీజేపీ తీర్మానం చేసిన కాకినాడ నంచే జిల్లాల పర్యటన మొదలుపెడతా. సెప్టెంబర్ 9న కాకినాడలో సభ పెడతా. తర్వాత అన్ని జిల్లాలు తిరుగుతా. రెండోదశలో అన్ని పార్టీల ఎంపీలపై ఒత్తిడి తీసుకొస్తాం. ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఏమేం చేయ్యాలో అన్ని చేస్తాం. అవసరమైతే అప్పటికప్పుడు వ్యూహం మార్చుకుంటాం. ఇక మూడో దశలో మా సత్తా ఏంటో చూపిస్తాం. స్టేటస్ కోసం రోడ్డెక్కుతాం. దేశం మొత్తం సీమాంధ్రవైపు చూసేలా పోరాటం ఉంటుంది.

టీడీపీ నేతలకెందుకు భయం :
స్పెషల్ స్టేటస్ ను టీడీపీ ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతోంది. చంద్రబాబు పదే పదే చెబుతారు.. రాష్ట్రం అప్పుల్లో ఉంది.. విభజన సరిగ్గా చెయ్యలేదు.. నిధులు లేవు.. కేంద్రంతో పెట్టుకోలేం అంటున్నారు. నేను అర్థం చేసుకోగలను. కానీ మన ఎంపీలు అడుక్కుతినేవాళ్లలాగా.. సర్ సర్ అంటూ ఎందుకు బతిమలాడుతారు. స్టేటస్ మనహక్కు. దాన్ని పోరాడి తెచ్చుకోవాలి. మన ఆత్మగౌరవాన్ని కేంద్రం దగ్గర తాకట్టు పెడతారా. కేంద్రంతో పోరాడటానికి మీకెందుకు భయం. మీకేమైనా లొసుగులున్నాయా. సీబీఐ ఎంక్వైరీ అంటూ భయపడతారు.. ఏం లొసుగులున్నాయని. కేంద్రంతో జాగ్రత్తగా ఉండాలంటారు. నిజమే కానీ.. కేంద్రం అంటే బ్రహ్మరాక్షసులు కాదు కదా. ఎన్నాళ్లు భయపడతారు. పార్లమెంట్ ను స్థంభింపజేయండి. స్టేటస్ విషయంలో టీడీపీ, వైసీపీ ఒకేమాట మీద ఉండాలి. మీ రాజకీయాలు తర్వాత. ముందు జనం సంగతి పట్టించుకోండి.

గో సంరక్షణపై :
బీజేపీవాళ్లు గోసంరక్షణపై దృష్టి పెట్టి.. మిగితా సమస్యలు వదిలేస్తున్నారు. నాకు 15 ఆవులున్నాయి. నేను గో సంరక్షకుడినే. మీకంత ప్రేముంటే ప్రతి బీజేపీ, హిందూవాహిని, భజరంగదళ్ కార్యకర్తలను ఒక్కో ఆవును పెంచుకోమని చెప్పండి. అవసరమైతే కార్పోరరేట్ వాల్లను గోరక్షణ చేయమని అడగండి. అంతేకాని గోసంరక్షణ పేరుతో రాజకీయాలు చేయొద్దు. సమస్యల్ని గాలికి వదిలేయకండి.

ఆరుకోట్లమంది లెక్కలేదా :
స్టేటస్ ఇవ్వడానికి మూడు రాష్ట్రాల సీఎంలు ఒప్పుకోవడంలేదు అంటున్నారు. మరి రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఆరుకోట్ల మంది వద్దన్నాం కదా.. మాకంటే ముగ్గురు సీఎంలే ఎక్కువయ్యారా. నాకు కేంద్రం అంటే గౌరవం ఉంది. కానీ ఆత్మాభిమానం తాకట్టు పెట్టే గౌరవం నాకు వద్దు.

జైరాం రమేష్ కంగ్రాట్స్ :
అప్పుడు పార్లమెంట్ లో మేధావి జైరాం రమేష్. ఆయనే మన రాష్ట్రాన్ని విడగొట్టారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎంపీగా ఎన్నికై.. చక్కటి వాతావరణంలో రాష్ట్రాన్ని విడగొట్టారు. ముందుగా ఆయన్ను ఎన్నుకున్న అప్పటి కాంగ్రెస్ ఎంపీలందరికీ గట్టిగా చప్పట్లు. జైరాం రమేష్. మీ తెలివికి, మేథస్సుకు నా జోహార్లు. నేను జైంరామేష్ సన్నిహితులను కొంతమందిని అడిగాను. తెలంగాణ ఎంపీలు రాష్ట్రం కోసం ఎంతగా పోరాడారో.. మన సీమాంధ్ర ఎంపీలు అంతలా పోరాడలేదంట. వాళ్లు సోనియా దగ్గరకు వెళ్లి మేడమ్ ప్లీజ్.. ప్లీజ్ అంటూ బతిమలాడారు. మీకు సిగ్గుండాలి.. దేబురించి అడుక్కోడానికి సిగ్గులేదా.. బానిసల్లాగా ఎందుకు లొంగిపోయారు. మీరు గట్టిగా పోరాడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా.

మోడీ అంటే గౌరవమే కానీ :
మోడీ అంటే గౌరవమే కానీ.. లొంగిపోయేంత గౌరవం మాత్రం కాదు. కన్నబిడ్డను చంపి తల్లిని బతికించారు అని విభజన తర్వాత మాట్లాడారు మోడీ. ఇప్పుడేమో తల్లికి నేత చీర ఎందుకు, పట్టుచీర ఎందుకు అంటూ మాట్లాడుతున్నారు. మోడీ గారు అర్థం చేసుకోండి. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేంత అభిమానం నేను చూపించలేను. మీ అనుభవంతో పోరాటం చేయ్యలేను కానీ.. భవిష్యత్ కోసం ఎంత పోరాటమైనా చేస్తా.

సినిమాలు చేస్తా.. రాజకీయం చేస్తా :
నేను తప్పకుండా సినిమాలు చేస్తా. ఎందుకంటే డబ్బులెవబ్బా. మీరంతా సర్థార్ సరిగ్గా చూడలేదు. అందుకే నాకు డబ్బులు రాలేదు. ఆగిపోయాయి ఈసారి కొంచెం గట్టిగా చూడండి. (నవ్వుతూ). సినిమాతో పాటు రాజకీయం చేస్తాను. రాజకీయం అంటే బూతు రాజకీయం కాదు.. ఆ రాజకీయాలు చేయను. నిస్వార్థంగా ప్రజలకోసం చేస్తాను. సామాజిక మార్పులు జరిగితే చాలు. స్టేటస్ సాధించేవరకు విశ్రమించను, వెనుకాడను, మడమతిప్పను.

మన ఎంపీలకు హిందీ రాదు :
కేంద్రంలో వాళ్లంతా హిందీలో మాట్లాడతారు. మన ఎంపీలకేమో హిందీ రాదు. హిందీ క్లాసుకెల్లి హిందీ నేర్చుకోండి. సాబ్ హమ్ కో స్పెషల్ స్టేటస్ చాహీయే, మేడమ్ హమ్ కో స్పెషల్ స్టేటస్ చాహీయే అని రెండు ముక్కలు హిందీ నేర్చుకోండబ్బా అది చాలు. మనోళ్లు తెలుగులో మాట్లాడతారు.. వాళ్లేమో వియ్ విల్ సీ వియ్ విల్ సీ అంటారు. అంతకు మించి ఏమీ జరగదు.

పోరాడుదాం పోరాడుదాం సాధించేవరకు పోరాడుదాం :
ఇదే నినాదంతో ముందుకు వెళ్తాం. కాకినాడలో సభ పెట్టి జిల్లాల యాత్ర మొదలుపెడతా. అభిమానులే నా బలం. మీరందరూ కలిస్తేనే నాకు బలం. నేను ఒంటరిగా ఏమీ చెయ్యలేను. మీరంతా కలిసివస్తేనే బలంగా పోరాడగలను. మీబలంతోనే కేంద్రంతో ఫైట్ చేస్తాను.

కేంద్రం కోసం ఇంగ్లీష్, హిందీలో :
మీకు ఇంగ్లీష్ లోనే చెబితేనే అర్థమవుతుంది. రెస్పెక్టెడ్ సర్స్ బీజీపీ అండ్ కాంగ్రెస్. వియ్ ఆర్ డిప్లీ హర్ట్. యూ ఆర్ నాట్ ఏబుల్ టు సీ అవర్ పెయిన్, యాంగర్, టియర్స్. మే బీ వియ్ ఆన్ నాట్ ఇన్ యువర్ విజబిలిటీ. బికాజ్ వియ్ ఆర్ సో డౌన్ డౌన్ డౌన్. అండ్ యువార్ సో అప్. వియ్ విల్ ఫైట్ అంటిల్ వియ్ గెట్ ఇన్ యువర్ విజబిలిటీ. ఢిల్లీ పెద్దల కోసం హిందీలో కూడా చెబుతా హమ్ లడెంగే లడేంగే హమ్ జితే తక్ లడెంగే జైహింద్.. జైహింద్

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news